కెరియర్ ప్రారంభంలో ఎన్నో షార్ట్ ఫిల్మ్ లలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న వైష్ణవి చైతన్య ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించింది. ఇకపోతే ఈ నటి తాజాగా విజయ్ దేవరకొండ , విరాజ్ హీరోలుగా సాయి రాజేష్ దర్శకత్వంలో రూపొందిన బేబీ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమా పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్ లలో విడుదల విడుదల అయ్యి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ టాక్ ను తెచ్చుకుంది.

దానితో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కడం మాత్రమే కాకుండా ఈ సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించిన ఆనంద్ , విరాజ్ , వైష్ణవి కి అద్భుతమైన గుర్తింపు కూడా లభించింది. ఈ అలాగే ఈ సినిమాకు దర్శకత్వం వహించిన సాయి రాజేష్ కు కూడా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. ఇకపోతే ఈ సినిమాలో ఈ ముద్దు గుమ్మ తన నటనతో అందచందాలతో ప్రేక్షకులను కట్టిపాడేయడంతో ప్రస్తుతం ఈ నటికి వరుస క్రేజీ సినిమా అవకాశాలు తెలుగులో దక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ ముద్దు గుమ్మకు తాజాగా ఓ క్రేజీ బ్యానర్ లో సినిమా అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన బ్యానర్ లలో ఒకటి అయినటువంటి సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఓ సినిమాలో ఈ ముద్దు గుమ్మకు హీరోయిన్ గా అవకాశం వచ్చినట్లు ... అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ బ్యానర్ వారు మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వార్త కనుక నిజం అయితే ఈ ముద్దు గుమ్మకు అదిరిపోయే రేంజ్ క్రేజీ బ్యానర్ లో సినిమా అవకాశం దక్కినట్లే అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: