లేటెస్ట్ గా వీరిద్దరి మధ్య గ్యాప్ కు సంబంధించి గాసిప్పులు రావడానికి కారణం వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ల ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్. కొన్ని రోజుల క్రితం చిరంజీవి ఇంటిలో జరిగిన ఈ ప్రీ వెడ్డింగ్ డే సెలిబ్రెషన్స్ కు మెగా ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు అల్లు ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చినప్పటికీ ఆపార్టీకి అల్లు అర్జున్ రాకపోవడం ఏమిటి అంటూ మెగా అభిమానులు ఆరాలు తీయడం మొదలు పెట్టారు.
ఇది జరిగిన కొద్ది రోజులకు అల్లు అర్జున్ తన ఇంటిలో వరుణ్ తేజ్ లావణ్యా త్రిపాఠి ల ప్రీ వెడ్డింగ్ డే సెలిబ్రెషన్స్ కు సంబంధించి మరొక పార్టీని పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ పార్టీకి రామ్ చరణ్ రాలేదు అన్న వార్తలు వచ్చాయి. మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరు వచ్చినప్పటికీ చరణ్ ఎందుకు రాలేదు అంటూ బన్నీ అభిమానులు ఇప్పుడు మరొకసారి ఆరా తీయడం మొదలుపెట్టారు.
దీనితో మళ్ళీ బన్నీ చరణ్ ల మధ్య గ్యాప్ అంటూ రగడ మొదలైంది. దీనికి సమాధానం బన్నీ ‘పుష్ప 2’ లో చెపుతున్నట్లు కనిపిస్తోంది. లేటెస్ట్ గా వస్తున్న లీకులు ప్రకారం ‘పుష్ప 2’ లో పుష్పరాజ్ తన భార్య శ్రీవల్లిని ‘ఇంద్ర’ సినిమాకు తీసుకు వెళ్ళిన సీన్ ను ఈమధ్య ఘాట్ చేశారట. ఆ సన్నివేశంలోనే ‘పుష్ప రాజ్ పై హత్యా ప్రయత్నం కూడ ఒక స్థాయిలో ఉండే విధంగా సుకుమార్ ఆ సీన్ ను ఘాట్ చేసినట్లు తెలుస్తోంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి