
అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీ రూపురేఖలను మార్చి బాలీవుడ్ ను షేక్ చేసిన ఒక తెలుగు డైరెక్టర్ అయ్యుండి ఇంత సక్సెస్ అందుకున్న తరువాత తెలుగు హీరోలు మాత్రం ఎవరు కూడా ఈ సినిమా గురించి మాట్లాడలేదు.. ముఖ్యంగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన మహేష్ బాబు రాజమౌళి కూడా ఈ సినిమా గురించి అసలు మాట్లాడలేదట. ఏదైనా ఒక సినిమా విడుదల అయితే కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా సెలబ్రిటీలు మొత్తం ఈ సినిమా తీసిన విధానాన్ని సైతం ప్రశంసిస్తూ ఉండేవారు.
అయితే యానిమల్ సినిమా గురించి ఏ ఒక్క తెలుగు సెలబ్రిటీ కూడా విచ్చేయకపోవడంతో చాలా మంది సైతం టాలీవుడ్ నటీనటుల సైతం భయపడుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు.ఇప్పటికి త్రిష యానిమల్ పోస్టర్ పెట్టి సూపర్ అంటేనే ఆమెను ఏకిపారేయడం జరిగింది. అలాంటి సినిమాని సపోర్టు చేస్తారా అంటూ ఆమె పైన విరుచుకుపడ్డారు.దీంతో మిగతా స్టార్స్ కూడా ఇలాంటి వైలెన్స్ రొమాంటిక్ ఉన్న సినిమా గురించి మాట్లాడితే ట్రోలింగ్ తప్పదని భయపడి ఎవరు కూడా ఈ సినిమా గురించి ట్విట్ చేయలేదని వార్తలు వినిపిస్తున్నాయి.