
ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ పోస్టర్ను ఇటీవలే నాగచైతన్య పుట్టినరోజు కూడా ప్రకటించడం జరిగింది. రెండేళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న సాయి పల్లవి ఈ సినిమాలో నటిస్తూ ఉండడంతో మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చిందని చెప్పవచ్చు. తండేల్ పూజా కార్యక్రమంలో ఈమెకు సంబంధించి ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తెలుగులో మరే హీరోయిన్ కి లేని క్రేజీ కూడా ఈ ముద్దుగుమ్మ సొంతం చేసుకుందని చెప్పవచ్చు..
సాయి పల్లవి ఎంచుకుంటున్న పాత్రలు తనకి క్రేజీ తెచ్చి పెట్టేలా ఉన్నాయి. తండెల్ సినిమాలో కూడా సాయి పల్లవి ఒక కీరోల్లో నటిస్తోందని తెలుస్తోంది. ఈ చిత్రంలో మొదట వేరే హీరోయిన్ అనుకోగా సాయి పల్లవి మాత్రమే ఈ పాత్రకు న్యాయం చేయగలరని చిత్ర బృందం భావించి అంతేకాకుండా ఆల్రెడీ హిట్టు కాంబినేషన్ కాబట్టి వర్కౌట్ అవుతుందని చిత్ర బృందం భావించి ఈమెను ఫిక్స్ చేసినట్లు సమాచారం. గతంలో నాగచైతన్య, సాయి పల్లవి లవ్ స్టోరీ సినిమాలో నటించి మంచి హిట్ అందుకున్నారు. గీత ఆర్ట్స్ బ్యానర్ పైన తండేల్ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తూ ఉన్నారు. దీంతో అభిమానుల సైతం సాయి పల్లవికి ఉన్న క్రేజ్ వల్లే ఈ సినిమా ఇలా పాపులర్ అవుతోంది అంటూ తెలుపుతున్నారు.