ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ ఆవిమర్శలు తట్టుకుని ‘యానిమల్’ బాలీవుడ్ బాక్సాఫీస్ ని సునామి షేక్ చేయడంతో ఏమూవీ ‘యానిమల్’  ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 800 కోట్ల వసూళ్లకు సాధించిది అంటూ  బాలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది. ఈమూవీకి సెన్సార్ ఇచ్చిన ‘ఏ’ సర్టిఫికెట్ కూడ పట్టించుకోకుండా ఈమూవీని చూడటానికి దేశవ్యాప్తంగా  యూత్ తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులు లు విపరీతంగా ధియేటర్స్ కు  రావడం టాపిక్ ఆఫ్ ది బాలీవుడ్ గా మారింది.  



ఈ ఘనవిజయంతో సందీప్ వంగా  పేరు పాన్ ఇండియా స్థాయిలో మారు మ్రోగి పోతోంది. దీనితో ఈ సంచలన దర్శకుడు అతి త్వరలో మొదలుపెట్టె సినిమా గురించి అనేక వార్తలు బాలీవుడ్ మీడియా రాస్తోంది. ఈమూవీ తరువాత సందీప్ వంగా ప్రభాస్ తో  తీయవలసిన  స్పిరిట్ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ ఫైనల్ అయినప్పటికి ఈమూవీ  షూటింగ్ ప్రారంభానికి మరో సంవత్సరం పట్టే అవకాశం ఉండటంతో ఇప్పుడు సందీప్ వంగా ఆలోచనలు ‘యానిమల్’ పార్క్ చుట్టూ తిరుగుతున్నాయి అంటూ బాలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది.



‘యానిమల్’ మూవీ చివరిలో ఈ మూవీ సీక్వెల్ కు సంబంధించిన లీకులు సందీప్ వంగా ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఎండ్ టైటిల్స్ తరువాత రణబీర్ కపూర్ ను విపరీతమైన హింసతో ప్రేక్షకులకు పరిచయం చేసి సందీప్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్ మీడియా వ్రాస్తున్న వార్తల ప్రకారం ఇప్పుడు ఆపాత్రను లీడ్ రోల్ గా ఈసీక్వెల్ లో మారుస్తారట. దీనితో   ఈ ప్రాజెక్టు  వార్తలు  బాలీవుడ్  మీడియా  కు  హాట్ టాపిక్  గా మారడం తో   త్వరలో   ప్రారంభo  కాబోతున్న ఈ  మూవీ  పై బాలీవుడ్  మీడియా లో  అనేక  వార్తలు  వస్తున్నాయి .   ఈ  వార్తాలు  నిజం అయితే  ఇండియన్  ఫిలిమ్ ఇండస్ట్రీలో మరొక సంచలనాన్ని ప్రేక్షకులు త్వరలో చూడబోతున్నారు అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: