యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి, తారక్ ప్రతిభ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమా కోసం ప్రాణం పెట్టేంత స్థాయి లో కష్టపడే అతికొద్ది హీరోలలో తారక్ ఒకరు.ఈ మధ్య కాలంలో తారక్ సినిమా లు వరుసగా విజయాలను సొంతం చేసుకుంటున్నా సోలో హీరో గా తారక్ టాలెంట్ కు తగిన మరో బ్లాక్ బస్టర్ హిట్ దక్కాలని అభిమానులు ఫీలవుతుండటం గమనార్హం.ఇప్పటికే ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ లిస్ట్ లో చేరిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మరో అరుదైన ఘనతను సాధించి అభిమానులు గర్వపడేలా చేశారు. ప్రముఖ అమెరికన్ మ్యాగజైన్ వెరైటీ తాజా గా గ్లోబల్ మీడియా లో 500 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితా ను విడుదల చేయ గా ఈ జాబితా లో తారక్ పేరు కూడా ఉండటం గమనార్హం. సౌత్ ఇండియా నుంచి ఈ జాబితాలో చేరిన తొలి హీరో ఎన్టీఆర్ కావడం అభిమానుల సంతోషానికి మరింత కారణమైంది.

జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ గ్లింప్స్ రిలీజ్ గురించి వేర్వేరు వార్తలు ప్రచారం లోకి వస్తున్నాయి. జనవరి నెల 1వ తేదీన దేవర గ్లింప్స్ విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. వెరైటీ మ్యాగజైన్ లో చోటు దక్కడం గురించి తారక్ రియాక్షన్ ఏ విధంగా ఉండనుందో చూడాలి. ఈ ఏడాది ఎన్టీఆర్ నటించిన ఒక్క సినిమా కూడా థియేటర్ల లో విడుదల కాలేదు. దేవర సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కాన్సెప్ట్ తో తెరకెక్కుతుండగా కొరటాల శివ యూనివర్స్ అనేలా ఈ సినిమా ఉండనుందని సమాచారం అందుతోంది. దేవర మూవీలో తారక్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ లాభాల్లో వాటా తీసుకుంటూ ఈ సినిమాలో నటిస్తున్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: