బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి నితీష్ తివారి మరికొన్ని రోజుల్లో "రామాయణం" అనే మూవీ ని తెరకెక్కించబోతున్న విషయం మనకు తెలిసిందే . ఈ మూవీ లో బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పాత్రలో రన్బీర్ కపూర్ ... రాముడి పాత్ర లో కనిపించనుండగా సీత  పాత్రలో సాయి పల్లవి కనిపించబోతుంది. ఇక ఈ సినిమాలో రావణాసురిడి పాత్రలో "కే జి ఎఫ్" సిరీస్ మూవీ తో ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న యాష్ కనిపించబోతున్నట్లు సమాచారం.

ఇక అద్భుతమైన క్రేజ్ ఉన్న నటీ నటులు ఈ సినిమాలో నటించనున్న నేపథ్యం లో ఈ మూవీ స్టార్ట్ కాకముందే ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా అంచనాలు భారీగా పెరిగి పోయాయి. ఇక పోతే ఈ ముగ్గురు కూడా ఈ సినిమా కోసం భారీ మొత్తం లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... రామాయణం మూవీ కోసం ఈ సినిమాలో రాముడి పాత్రలో కనిపించబోతున్న రన్బీర్ కపూర్ ఏకంగా 75 కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకోబోతున్నట్లు ... అలాగే ఈ సినిమాలో సీత పాత్ర లో కనిపించనున్న సాయి పల్లవిసినిమా లోని పాత్ర కోసం 6 కోట్ల రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి . అలాగే ఈ సినిమాలో రావణాసురుడి పాత్రలో కనిపించబోతున్న యాష్ ఈ మూవీ లోని పాత్ర కోసం ఏకంగా 80 కోట్ల రెమ్యూనిరేషన్ పుచ్చుకోబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది . ఇలా ఈ ముగ్గురు కూడా ఈ సినిమా కోసం భారీ మొత్తం లో రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: