టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా హీరోగా పేరు తెచ్చుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. టాలెంట్ ని నమ్ముకుని ఇంత పెద్ద హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక ఆయనని స్ఫూర్తిగా తీసుకొని ఎందరోసిని ఇండస్ట్రీకి ధైర్యం గా వస్తున్నారు. కేవలం ఇండస్ట్రీలో డబ్బు ఉంటే సరిపోదు అని నటన టాలెంట్ ఉండాలి అని ప్రూఫ్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి. అలా ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవి సినిమాల పరంగా తన కెరియర్ లో తీసుకుంటున్న ఒక తప్పుడు నిర్ణయం పై మెగా అభిమానులు మండిపడుతున్నారు.

ఇక అసలు విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలేవి పెద్దగా హిట్ అందుకోలేదు. పైగా చిరంజీవి పై చాలా రకాల ట్రోలింగ్ సైతం చేస్తున్నారు. అయితే ఆ ట్రోలింగ్ కి కారణం భోళా శంకర్ సినిమా అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ గా మారిందో మనందరికీ తెలిసిందే. తమన్న హీరోయిన్ గా మెగాస్టార్ చిరంజీవి హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలి పాత్రలో కనిపించింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవడం ఏ కాకుండా ట్రోలింగ్ కు సైతం గురైంది.

అయితే తాజాగా ఇప్పుడు ఆ ఫ్లాప్ అయిన సినిమాని తీసిన మెహర్ రమేష్ ను నమ్మి మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఆయనతో మరొక సినిమా కూడా చేయడానికి సిద్ధమైనట్లుగా వార్తలు వినబడుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ప్రెసెంట్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూట్లో చిరంజీవిని ప్రత్యేకంగా కలిశారు మెహర్ రమేష్. దానికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి . దీంతో మెగా ఫాన్స్ మండిపడుతున్నారు . పోయి పోయి మళ్లీ ఆ ఫ్లాప్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తున్నావా..? నీ మంచితనం చూసి జాలి పడాలో నీ ఫ్లాప్స్ చూసి బాధపడాలో అర్థం కావడం లేదు.. అంటూ ఫైర్ అయిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: