అదేమిటంటే ఇటీవలే వియత్నాం ప్రైమ్ మినిస్టర్ ఇండియాకి రావడం జరిగింది.. ఇక్కడ మన పీఎం నరేంద్ర మోడీ తో పాటు దేశంలో చాలా విభాగాల నుంచి 52 మంది స్పెషల్ గెస్ట్ లను కూడా పిలిపించారట..వియత్నాం ప్రైమ్ మినిస్టర్ తో పాటుగా మన పీఎం తో కలిసి ఏర్పాటు చేసిన లంచ్ ప్రోగ్రాం కి సైతం.. ఇండియన్ ఎంటర్టైన్మెంట్ నుంచి కేవలం ఆవికా గోర్ కు మాత్రమే ఇలాంటి అవకాశం దక్కిందట.. ఈ విషయాన్ని ఆవికాగోర్ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
వియత్నాం ప్రైమ్ మినిస్టర్ , మన పీఎం నరేంద్ర మోడీకి నమస్కారం చేస్తూ ఉన్నటువంటి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఫోటోలు చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఏంటి ఇలాంటి ఒక అరుదైన అవకాశం తనకు మాత్రమే లభించడం ఆశ్చర్యంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం రావడానికి కూడా తనకి ఎంతో గౌరవంగా ఉంది అంటు ఈ ముద్దుగుమ్మ షేర్ చేసింది. ఈ విషయం పైన అటు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసింది. అలాగే కేవలం 52 మందిలో ఎంటర్టైన్మెంట్ నుంచి తనలాంటి వారు రావడం చాలా గర్వంగా ఉందంటూ ఒక పోస్ట్ షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. అవికాగోర్ చాలా సాంప్రదాయమైన పద్ధతిలో చీర కట్టుకొని మరి వచ్చింది.