ఈ మధ్య బుల్లితెరపై పలు టీవీ షోలలో సుధాకర్ కనిపించారు. అనారోగ్య సమస్యల వల్ల ఆయన గుర్తుపట్టలేని స్థితిలో కనిపించారు. తన కొడుకు బెన్ని కూడా సినిమాల్లో నటించాడని చెబుతూనే తన సినీ జీవిత విశేషాలను పంచుకున్నారు. విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతి మూవీనే తన చివరి చిత్రమని చెప్పారు. ఈ మూవీ తర్వాత తనకు బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఆస్పత్రికి దగ్గరయ్యానని, దానివల్ల సినిమాలకు దూరమవ్వాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు.
ఇప్పుడు తాను సినిమాలు చేయలేనని, తన కొడుకు సినిమాల్లో నటించి తన లోటును భర్తీ చేస్తాడని తెలిపారు. ప్రస్తుతం సుధాకర్ కొడుకు బెన్నీకి సరైన పాత్రలు రావడం లేదు. అందుకే ఆయన ప్రేక్షకులకు అంతగా దగ్గర కాలేదు. భవిష్యత్తులో బెన్నీకి మంచి పాత్రలు రావాలని, సుధాకర్ ఆశ నెరవేరాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఏదేమైనా ఓ స్టార్ కమెడియన్ బ్రెయిన్ స్ట్రోక్‌తో గుర్తుపట్టలేని విధంగా మారడం చూసి మరికొందరు బాధను వ్యక్తం చేస్తున్నారు.