చిత్ర పరిశ్రమ లో సెటిల్ కావాలంటే ఏ చదువు చదవాలి ? అంటే ఈ చదువు సంగతి ఏమోగానీ .. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఫ్యాన్ ఇండియా ఎంట్రన్స్ అయితే కచ్చితంగా రాయాలి . ఇప్పటికే రీజినల్ గా తామేంటో ప్రూవ్ చేసుకున్న హీరోలు , దర్శకులైన .. ఫ్యాన్ ఇండియా ఎంట్రన్స్ పక్కాగా రాయాల్సిందే .  ఇక తాజా గా ఈ ఎంట్రన్స్ రాయడానికి అఖండ 2 తో ప్రిపేర్ అవుతున్నాడు బోయపాటి .. నట‌సింహం బాలకృష్ణ .. బోయపాటి తో కలిసి సినిమా చేస్తే బాలయ్యకు బ్లాక్ బస్టర్ గ్యారంటీ అనే విషయం మన దగ్గర ప్రూవ్  అవుతూనే ఉంది .


 ఇక అఖండ సినిమా సమయంలో ఈ స్టేట్మెంట్ వందకు వంద శాతం నిజమైంది . ఈ సినిమా టాక్ నార్త్ లోను పాజిటివ్ గా కనిపించింది .  అందుకే ఇప్పుడు అఖండ సిక్వెల్ తాండవం ని పాన్ ఇండియా రేంజ్ లో తీసుకురాబోతున్నారు మేకర్స్ . ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న అఖండ 2 ..త్వరలోనే షూటింగ్ కు వెళ్లబోతుంది . ఇక ఈ సినిమా మీద అంచనాలు మామూలు గా లేవనే చెప్పాలి .. ఆ అంచనాలకు తగ్గట్టే ప్రీ ప్రొడక్షన్ ప్లానింగ్ కూడా చేస్తున్నారు దర్శకుడు బోయపాటి .


 అఖండ 2 పాన్ ఇండియా రేంజ్ లో తానేంటో ప్రూ చేసుకోవాలని బోయపాటి ప్లాన్ . ఆధ్యాత్మిక టచ్ ఉన్న కంటెంట్ కి నార్త్ లో ఇప్పుడు సూపర్ క్రేజ్ ఉంది . అఖండ 2 లో ఆధ్యాత్మిక టచ్ బాగానే ఉంటుంది .. ఈ పాజిటివ్ రెస్పాన్స్ బోయపాటి కి విజిటింగ్‌ కార్డుల ఉపయోగ పడుతుందా లేదా చూడాలి . ప్యాన్‌ ఇండియా ఎంట్రన్స్ లో ఆయన డిస్టింక్షన్ లో పాస్‌ అవుతారా అనేది ఫిల్మ్ నగర్‌లో ఇప్పుడు హ‌ట్‌ డిస్కస్‌ అవుతున్న పాయింట్ .

మరింత సమాచారం తెలుసుకోండి: