ప్రజెంట్ ఈ న్యూస్ తెలుగు సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సుకుమార్ ప్రెసెంట్ ఏ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నాడో మనకు తెలిసిందే . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 641 కోట్లు మూడు రోజుల్లోనే కలెక్ట్ చేసి పుష్ప2 ఇండస్ట్రీలో సంచలన రికార్డును నెలకొల్పింది. అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన పుష్ప2 సినిమా డిసెంబర్ 5వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది. 


రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే 641 కోట్లు సాధించింది. దీంతో సుకుమార్ - బన్ని ని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . ఇక బన్ని గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఏకంగా తన కెరియర్లో చేసిన అన్ని సినిమాల సక్సెస్ ని సుకుమార్ ఖాతాలో వేసేసాడు . సుకుమార్ లేనిదే నేను లేను అంటూ బాగా ఎమోషనల్ గా స్పందించారు.  అయితే ఇప్పుడు సుకుమార్ కి అదే పెద్ద పెద్ద తలనొప్పులు క్రియేట్ చేస్తూ వచ్చింది. ముందుగానే మెగా వర్సెస్ అల్లు వార్ సోషల్ మీడియాలో ఎలా హీట్ పెంచేస్తుంది అనే విషయం అందరికి తెలిసిందే.



ఆల్రెడీ సుకుమార్ - రామ్ చరణ్  తో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు . ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - సుకుమార్ కి కాల్ చేసి మరి ఈ సినిమాని కొన్నాళ్లపాటు వాయిదా వేయాలి అంటూ స్పెషల్గా రిక్వెస్ట్ చేశారట .బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ప్రజెంట్ రాంచరణ్ ఒక సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలు కావాల్సింది . కానీ కొన్ని అనివార్య కారణాల చేత ఆలస్యం చేస్తూ వచ్చారు. ఆ సినిమా కారణంగా సుకుమార్ - చరణ్ కాంబోలో తెరకెక్కాల్సిన సినిమా మరింత ఆలస్యంగా సెట్స్ పైకి రాబోతుందట. దీంతో రాంచరణ్ సుకుమార్ కు కాల్ చేసి మరి స్పెషల్ గా రిక్వెస్ట్ చేశారట.  అదే నిజమైతే మాత్రం మెగా ఫ్యాన్స్ బ్యాడ్ న్యూస్ వినక తప్పదు అంటున్నారు సినీ ప్రముఖులు.  చూద్దాం మరి సుకుమార్ లేదా రామ్ చరణ్ దీనిపై ఎలా స్పందిస్తారో???

మరింత సమాచారం తెలుసుకోండి: