సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న వరుణ్ తేజ్.. చివరిగా మట్కా సినిమాతో వచ్చి డిజాస్టర్ గానే నిలిచారు. కనీసం ఈసారైనా విజయం సాధిస్తారా అని అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తూ ఉండగా.. సరికొత్త జానర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఈరోజు వరుణ్ తేజ్ పుట్టినరోజు కావడంతో ఈ సందర్భంగా చిత్ర బృందం ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ చూస్తూ ఉంటే హారర్ కామెడీ నేపథ్యంలో జరిగే కథ అన్నట్టుగా సమాచారం.

అసలు విషయంలోకెళితే.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై మేళ్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ తన 15వ చిత్రాన్ని అనౌన్స్ చేస్తూ ఒక పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో ఒక చిన్న కుండ,  దాని చుట్టూ మంట పెద్ద ఎత్తున రగులుతోంది. అంతేకాదు కుండపై డ్రాగన్ బొమ్మతో పాటు కొరియన్ భాషలో చుట్టూ ఒక బ్యాండ్ పైన అక్షరాలు కూడా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా హారర్ కామెడీ కథ అన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ఇండో కొరియన్ హారర్ కామెడీ కథ అని కూడా మేకర్స్ ప్రకటించారు. ముఖ్యంగా వరుణ్ తేజ్ హారర్ కామెడీతో రాబోతున్నట్టు,ఇది ఇండియా కొరియా దేశాలకు సంబంధించిన కథ అని కూడా సమాచారం.

ఈ సినిమాకి ప్రముఖం మ్యూజిక్ డైరెక్టర్ సంగీతాన్ని అందిస్తూ ఉండగా యూవీ క్రియేషన్స్,  ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారో తెలియాల్సి ఉంది. ఇకపోతే డైరెక్టర్ మేర్లపాక గాంధీ చివరిగా కృష్ణార్జున యుద్ధం, లైక్ షేర్ సబ్స్క్రైబ్, మాస్ట్రో సినిమాలతో యావరేజ్ గానే నిలిచాడు. మరి ఈ సినిమాతో హిట్టు కొట్టాలనుకుంటున్నాడు.ఈ ఇద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: