
ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియన్ ఎడిషన్ తొలి పత్రిక ముఖ చిత్రంగా బన్నీ ఫోటోనే ప్రచురించడం అతడి రేంజ్ ని సూచిస్తోంది. బాలీవుడ్ టాప్ హీరోలకు కూడ దక్కని గౌరవం ఇప్పుడు బన్నీకి దక్కడం సంచలనంగా మారింది. ది హాలీవుడ్ రిపోర్టర్ 1930 నుంచి డైలీ ట్రేడ్ పేపర్ గా విదేశాల్లో చాల పేరుగాంచింది. 2010 నుంచి ప్రింట్ వెర్షన్ మొదలుపెట్టింది.
ఈపత్రికకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది చందా దార్లు ఉన్నారు. ఈపత్రికకు ఆన్ లైన్ ఎడిషన్ కూడ ఉంది. ఈమ్యాగజైన్ ఇండియన్ మార్కెట్ పై దృష్టి పెట్టి భారత్ లోకి ఎంటర్ అయింది. 200 రూపాయలు ఖరీదు గల ఎడిషన్ కావడంతో బాగా ధనవంతులు మాత్రమే ఈ పత్రికకు చందార్లుగా మారే ఆస్కారం ఉంది. అయితే బన్నీకి ఉన్న క్రేజ్ రీత్యా యూత్ ఎంత ధర పెట్టి అయినా తమ మ్యాగజైన్ కొంటారు అన్న వ్యూహంతో ఈ పత్రిక బన్నీ మ్యానియాను తన పత్రిక సర్క్యులేషన్ పెంచుకోవడానికి ఉపయోగించు కుంటోంది అనుకోవాలి.
కవర్ పేజ్ పై బన్నీ ముఖచిత్రంతో పాటు అనేక విషయాల పై అల్లు అర్జున్ తనదైన రీతిలో ఈ ఇంటర్వ్యూలో స్పందించారు. తాను ఒక సినిమా కథను ఎంచుకునేడప్పుడు ఆ కథ సగటు ప్రేక్షకుడి స్థాయిలో ఆలోచిస్తూ ఆకథ సాధారణ ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా అన్న ఆలోచన తాను చేస్తూ ఉంటానని అదే తన సక్సస్ సీక్రెట్ అని అన్నాడు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ బన్నీ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది..