
సీనియర్ నటి రంభ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ చిన్నది తెలుగు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు అందుకుంది. అతి తక్కువ సమయంలోనే రంభ ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకుల మనసులను దోచుకుంది. దాదాపు చిత్రపరిశ్రమలో ఉన్న స్టార్ హీరోల సినిమాలలో నటించింది. మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున, బాలకృష్ణ లాంటి ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా చేసి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది.
ఇక సినిమాలలో సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగిస్తున్న సమయంలోనే రంభ వివాహం చేసుకుంది. వివాహ అనంతరం ఎప్పటిలానే సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు రంభ ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. అనంతరం సినిమాలకు రంభ పూర్తిగా దూరమయ్యారు. ఈ విషయంపైన తాజాగా రంభ స్పందిస్తూ ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. తన పిల్లలకు ఓ వయసు వచ్చేంతవరకు తల్లిగా తన పూర్తి బాధ్యత తీసుకుంటానని రంభ చెప్పారు.
నా పిల్లలను దగ్గరుండి మరి నేనే చూసుకుంటాను. మా బాబుకు ఇప్పుడు ఆరు సంవత్సరాలు. కుమార్తెలకు 14, 10 సంవత్సరాలు. ఇప్పుడు వారు ఎవరిపైన ఆధారపడకుండా వారి పనులు వారు చేసుకుంటున్నారు. నా పిల్లల కోసమే ఇన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్నాను. నాకు సినిమాలపై ఉన్న ఆసక్తి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. నా భర్త నాకు ఫుల్ సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఆయన ప్రోత్సాహంతోనే టీవీ షోలకు జడ్జిగా వస్తున్నాను. ప్రస్తుతం టీవీ షోలలో జడ్జిగా వ్యవహరించేందుకు నా కుటుంబ సభ్యులను అడిగిన సమయంలో వారు ఒప్పుకున్నారు. వారి ప్రోత్సాహంతోనే నేను న్యాయ నిర్ణీతగా వ్యవహరిస్తున్నారని నటి రంభ తెలిపారు. ప్రస్తుతం రంభ షేర్ చేసుకున్న ఈ విషయాలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి.