
కానీ ఈ సినిమా ఇప్పటికే వాయిదా పడింది .. ఇక ఘాటీ సినిమా వాయిదా పడిందని విషయం అందరికీ తెలిసిందే .. కానీ ఇక్కడ మరో విడుదల తేదీని ప్రకటించకుండా పూర్తిగా సైలెంట్ గా ఉండటం కొంత ఆశ్చర్యంగా మారింది .. యువి క్రియేషన్స్ బ్యానర్ అంటేనే అన్ ప్రెడిక్టబుల్ అంటారు ప్రేక్షకులు .. మరో పాన్ ఇండియా మూవీ ప్రభాస్ రాజా సాబ్‌కు కూడా ఇదే సిచువేషన్ గ్లింప్స్ విడుదల చేశారు .. రిలీజ్ తేదీ కూడా ప్రకటించారు టీజర్ కూడా రెడీ అన్నారు .. అంతలోనే అందరూ సైలెంట్ అయిపోయారు .. టీజర్ ఏమైందో తెలియదు సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది ఎవరికీ తెలియడం లేదు .. ఇక పవన్ హరిహర వీరమల్లు సంగతి కూడా ఇదే ..
ఇప్పటికే ఈ సినిమా ఎన్నిసార్లు వాయిదా పడిందో మేకర్స్ కు కూడా గుర్తు లేదు .. ఇక ఈసారి రిలీజ్ పక్కా అంటున్నారు ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు అంతలోనే మరోసారి వాయిదా కూడా వేసేసారు. మూవీ టీమ్ అంతా సైలెంట్ అయిపోయారు .. విజయ్ దేవరకొండ కింగ్డమ్ విషయంలో కూడా ఈ మధ్య ఇదే టాక్ జరుగుతుంది . టైటిల్ గ్లింప్స్ తో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో ఊపు తెప్పించింది సినిమా ఆ ఉపును అలాగే కొనసాగించి ఉంటే అంతా బాగుండేది .. మధ్యలో గ్యాప్ ఇచ్చారు .. దీంతో రిలీజ్ పై అనుమానాలు వచ్చాయి .. తాజాగా నాగ వంశి క్లారిటీతో అంత సద్దుపడింది .. విడుదల తేదీ పై సరైన క్లారిటీ లేకపోవడం తోనే ఇలా చాలా సినిమాలు సైలెంట్ అవుతున్నాయని .. విడుదల తేదీ లాక్ అయిన తర్వాత సినిమా ప్రమోషన్లు సంగతి చూసుకుందాం అన్నట్టు ప్రొడక్షన్ కంపెనీలు కూడా తాపీగా కూర్చుంటున్నాయి ..