- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

ఒకప్పుడు టీవీలో ఓ కొత్త సినిమా తొలిసారి టెలికాస్ట్ అవుతుందంటే మామూలు హడావుడి కాదు .. దాని గురించి విపరీతంగా పబ్లిసిటీ చేసే వాళ్ళు .. యాడ్స్ మొతెక్కి పోయేవి. సినిమా ఎంత నిడివి ఉంటే అంత నిడివితో యాడ్స్ పడేవి.. అయినా ప్రేక్షకులు ఓపిగ్గా సినిమా చూసేవాళ్ళు.. టీవీలో కొత్త సినిమా చూడటం అప్పట్లో గొప్ప వినోదంగా ఉండేది. కానీ తర్వాత రోజులు మారిపోయాయి. ఓటీటీలు వచ్చి టీవీ ఛానల్ లో సినిమాల కు గుర్తింపు లేకుండా చేశాయి. నిర్మాతలకు కూడా భారీగా వస్తున్న డిజిటల్ హక్కుల ఆదాయాన్ని చూసుకొని శాటిలైట్ను లైట్ తీసుకున్నారు. దీంతో సాటిలైట్ మార్కెట్ కుప్పకూలిపోయింది. కొత్త సినిమాలు టీవీ ఛానల్లో వేస్తే చూసే జనం తగ్గిపోయారు. దీంతో టిఆర్పీలు పడిపోయాయి. ఒకప్పుడు పెద్ద సినిమా టీవీలో వస్తే రేటింగ్ 20 కి తగ్గేది కాదు ... కానీ ఇప్పుడు పదికి అటు ఇటుగా ఉంటుంది.


గత ఏడాది థియేటర్లలో పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచి ఓటీటీలో కొన్ని వారాలపాటు ట్రెండ్ అయిన పుష్ప 2 సినిమాని తాజాగా టీవీలో ప్రసారం చేస్తే దీని టిఆర్పి 12 కు అటు ఇటుగా వచ్చింది. ఒకప్పుడు బన్నీ సినిమాలకు టిఆర్పి 20 కి తగ్గేదే కాదు .. ఇప్పుడు ఈ రేటింగ్ కూడా చాలా ఎక్కువే అనుకునే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పెద్ద సినిమాలను చాలా మంది థియేటర్లలో చూసేస్తున్నారు. అక్కడ మిస్ అయిన ఓటీటీలో బ్రేక్ లేకుండా చూస్తున్నారు.. అలాంటిది ఒక పర్టికులర్ టైం లో యాడ్స్ మధ్య సినిమా చూసేందుకు ఇప్పుడు ఎవరూ ఆసక్తి చూపటం లేదు. ఏది ఏమైనా చాలా సినిమాలను నామమాత్రపు రెట్లతో టీవీ చానల్స్ కొంటున్నాయి .. ఆ రేటు కూడా గిట్టుబాటు కావటం కష్టంగా ఉందని చెప్పాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌తో స‌మ‌స్య మీది.. ప‌రిష్కారం మాది..

అవినీతి అయినా.. లంచాలైనా.. రాజ‌కీయ నాయ‌కులు పెట్టే ఇబ్బందులు అయినా మీ స‌మ‌స్య‌ను మా స‌మ‌స్య‌గా భుజాన వేసుకుంటాం. నేత‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. అధికారులు దురుసుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని చింతించాల్సిన అవ‌సర‌మే లేదు. రండి.. చేయి చేయి క‌లుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ స‌మ‌స్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.. ప‌రిష్కార మార్గాన్ని పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి: