
అయితే గత కొన్నేళ్లుగా నిర్మాణంలో ఉన్న టైసన్ నాయుడు ఇంకా అడ్డంకులను దాటనే లేదు. టీజర్ వచ్చి ఇప్పటికీ ఏడాది అవుతూ ఉన్న ఎలాంటి అప్డేట్ కూడా కనిపించడం లేదు. అలాగే ప్రస్తుతం ప్రొడక్షన్లో ఉన్న కిష్కింధపురి ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేయడం జరిగింది. అలాగే అంతకుముందు హైందవ అనే అనౌన్స్మెంట్ కూడా రిలీజ్ చేశారు. ఈ నాలుగు చిత్రాలలో రెండు ఫాంటసీ టచ్ ఉన్న పాన్ ఇండియా సినిమాలు.
ఒక సినిమా సెట్స్ మీద పెట్టడానికి మీడియం రేంజ్ హీరోలు చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో సాయి శ్రీనివాస్ మాత్రం ఇంత స్పీడుగా ఉండడం చూసి అభిమానులు మెచ్చుకుంటున్నారు. అయితే రిలీజ్ డేట్ ప్లాన్ విషయంలో మాత్రం ఎక్కడో తేడా కొడుతున్నట్లుగా కనిపిస్తోంది.. ముందుగా భైరవం,టైసన్ నాయుడు వంటి సినిమాలు వ్యవహారం తేల్చాలి ఈ సినిమాలు ప్రేక్షకులకు కనెక్ట్ అయితే కచ్చితంగా ఆ తర్వాత రెండు సినిమాలు విజయాలను అందుకుంటాయి. రాక్షసుడు సినిమా తర్వాత అంతటి స్థాయిలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సక్సెస్ అందుకోలేదు. ఇక సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ కూడా పలు చిత్రాలలో బిజీగా ఉన్నారు.