టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు ప్రేక్షకుల్లో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంచనాలకు మించి పెరుగుతుండగా నిన్న సమంత పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే. సమంత పుట్టినరోజు సందర్భంగా ఏవైనా అప్ డేట్స్ వస్తాయని భావించిన అభిమానులకు ఒకింత భారీ షాక్ తగిలిందనే చెప్పాలి. సమంత పుట్టినరోజు కానుకగా అధికారికంగా కానీ అనధికారికంగా కానీ ఎలాంటి అప్ డేట్స్ అయితే రాలేదు.
 
బన్నీ అట్లీ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తారని గతంలో వార్తలు వినిపించాయి. వైరల్ అయిన వార్త నిజమైతే మాత్రం ఏదో ఒక ప్రకటన కచ్చితంగా వచ్చి ఉండేది. సమంత రెండో పెళ్లి గురించి ఈ మధ్య కాలంలో పలు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. సమంత సొంత బ్యానర్ పై మా ఇంటి బంగారం అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.
 
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. సమంత ఈ సినిమాతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. సమంత పారితోషికం 4 నుంచి 6 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా ఈ స్థాయిలో పారితోషికం అందుకుంటున్న స్టార్ హీరోయిన్లు చాలా తక్కువమంది ఉన్నారు. సమంత శుభం సినిమాతో నిర్మాతగా లక్ పరీక్షించుకుంటున్నారు.
 
స్టార్ హీరోయిన్ సమంత నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుని మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సమంత లుక్స్ విషయంలో కూడా ఎంతో కేర్ తీసుకుంటున్నారు. సమంత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ కావాలని ఫ్యాన్స్ భావిస్తుండగా హీరోయిన్ సమంత కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి. సమంత నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలను సృష్టించే ఛాన్స్ అయితే ఉంటుందని కచ్చితంగా చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: