విజయ్ దేవరకొండ.. గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా మారుమ్రోగిపోతున్న పేరు . మెగాస్టార్ కన్నా పవర్ స్టార్ కన్నా ఎక్కువగా జనాలు పొగిడేసిన పేరే ఈ విజయ్ దేవరకొండ . దానికి కారణం కూడా అందరికీ తెలిసిందే.  కాశ్మీర్లోని పెహలగంలో జరిగిన అటాక్ పై ఓపెన్ గా స్పందించి తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ . మొదటి నుంచి విజయ్ దేవరకొండ అంటే పడి చచ్చిపోయే జనాలు ఎక్కువగానే ఉంటారు . అయితే సూర్య హీరోగా నటించిన "రెట్రో" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి  చీఫ్ గెస్ట్ గా హాజరైన విజయ్ దేవరకొండ  ఉగ్రదాడిపై ఓ రేంజ్ లో ఫైర్ అయిపోయారు .


"ఆ టెర్రరిస్ట్ నా కొడుకులు అంటూ ఓ రేంజ్ లో తన కోపాన్ని వెళ్ళగక్కారు". అంతేకాదు ఆయన వర్క్ చేసిన "ఖుషి" సినిమా టైంలోని జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు . ఇదే మూమెంట్లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ .."500 ఏళ్ల ట్రైబల్స్ కొట్టుకున్నట్టు బుద్ధి లేకుండా కామన్ సెన్స్ లేకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు" అంటూ టంగ్ స్లిప్ అయ్యాడు విజయ్ దేవరకొండ . ఇక్కడే ఇప్పుడు విజయ్ దేవరకొండపై ట్రైబల్ ఉద్యమ నేతలు ఫైర్ అయిపోయారు. విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలపై ట్రైబల్ సంఘాలు మండిపడుతున్నాయి.



విజయ్ చరిత్ర తెలియకుండా ఇలా మాట్లాడుతున్నాడు అని.. హేళన చేసినట్లు మాట్లాడడం కరెక్ట్ కాదని .. స్టేజి పైకి వచ్చి మైక్ పట్టుకుంటే పెద్ద స్టార్లు అయిపోయిన్నట్లేనా..? అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీని పట్ల విజయ్ దేవరకొండ బహిరంగ క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ ఇంత అగ్రేసివ్ గా ఒక స్పీచ్ ఇచ్చినప్పుడే ఏదో రాద్ధాంతం జరుగుతుంది అని అయితే ముందే అనుకున్నారు జనాలు. సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఈ న్యూస్ బాగా వైరల్ అయింది.  అందరూ అనుకున్నట్టే విజయ్ దేవరకొండ ఈ స్పీచ్ పట్ల ఎంత పాజిటివ్ కామెంట్ లు దక్కించుకున్నారో.. అంతే నెగిటివ్ కామెంట్స్ కూడా దక్కించుకున్నాడు..!

మరింత సమాచారం తెలుసుకోండి: