- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

మే నెల లో టాలీవుడ్ లో మెగా తుఫాన్ రాబోతుంది. మండే ఎండల్లో... మెగాస్టార్ ఫ్యామిలీ సినిమా ల న్యూస్ ఇప్పుడు సినీ ప్రియుల కు , మెగాభిమానుల‌కు మంచి చల్లదనం పంచనున్నాయి. దీంతో మెగా న్యూస్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నార‌న‌డం లో సందేహం లేదు. ఇంకా చెప్పాలంటే మే నెల అనేది మెగా ఫ్యాన్స్ కు ఓ బిగ్ బ్లాస్ట్ ఫెస్టివ‌ల్‌గా మారుతుంద‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నెల‌లో ఒక‌టి రెండు కాదు వ‌రుస పెట్టి స‌ర్ ఫ్రైజ్ లు మెగా హీరోలు ఇవ్వ‌బోతున్నారు. అన్నింటి కంటే ఫ‌స్ట్ చెప్పుకోవాల్సింది మెగాస్టార్‌ చిరంజీవి ఐకానిక్‌ బ్లాక్‌బస్టర్‌ 'జగదేక వీరుడు అతిలోక సుందరి' రీ-రిలీజ్ గురించే ... ఈ సినిమా రిలీజ్ అయ్యి 35 ఏళ్లు అవుతోన్న వేళ మే 9న 2 డీ - 3 డీ ఫార్మాట్‌లో ఈ సినిమా రిలీజ్ అవుతోంది.


ఇక మే 9వ తేదీనే మ‌రో బిగ్ న్యూస్ మెగా ఫ్యామిలీ నుంచి ఉంది. లండన్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో రామ్‌ చరణ్ మైనపు ప్రతిమ ఆవిష్కరణ ఉంటుంది. చ‌ర‌ణ్ త‌న ఫ్యామిలీ తో క‌లిసి ఈ ఈవెంట్ కు హాజ‌రు కానున్నారు. ఇది ఫ్యాన్స్ కు పెద్ద డ‌బుల్ ధ‌మాకా అని చెప్పాలి. ఇక మ‌రో వైపు పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కూడా మే నెలను హీటెక్కించబోతున్నాడు. 'హరిహర వీరమల్లు' షూటింగ్‌ని మేలో పూర్తి చేసి, డబ్బింగ్‌ కూడా స్టార్ట్ చేస్తార‌ట‌. ఇక ఓజీ బ్యాలెన్స్ షూటింగ్ కూడా మే నెల‌లోనే మొద‌ల‌వుతుంద‌ట‌.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.


మరింత సమాచారం తెలుసుకోండి: