సమ్మర్ సీజన్ మొదలైపోయింది. మండుటెండల్లో.. అందరూ వెకేషన్లు, ట్రిప్లు అంటూ రిలేక్స్ అవ్వడానికి ప్రయత్నిస్తుంటే.. మన స్టార్ హీరోలు మాత్రం ఎవరి సినిమాల సెట్స్‌లో వాళ్ళు బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఎండలను సైతం లెక్కచేయకుండా సినిమా సెట్స్‌లో సందడి చేస్తున్నారు. తాజాగా వెకేషన్‌కు వెళ్ళిన మహేష్ కూడా.. సెట్స్‌లోకి అడుగుపెట్టి మేకప్ వేసేసాడు. ఇక మహేష్ తో పాటు ఇతర స్టార్ హీరోలు అందరూ కూడా ఎవరి సినిమాలతో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఆ సినిమాలేంటి.. ఎవరు ఎక్కడ ఉన్నారు..? అవి వివరాలు ఒకసారి తెలుసుకుందాం.


టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, మహేష్ కాంబోలో ఎస్ఎస్ఎంబి 29.. పాన్ వరల్డ్ రేంజ్ లో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జన్వాడాలో ఈ సినిమా షూట్ కొనసాగుతుంది. మహేష్‌తో పాటు.. ఈ స్కెడ్యూల్‌లో మరికొందరు నటి నటులు పాల్గొంటున్నారు. బాలకృష్ణ - బోయపాటి డైరెక్షన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ అఖండకు సీక్వెల్ గా అఖండ 2 తాండవం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షెడ్యూల్ ప్రస్తుతం ఆర్‌హెచ్‌సీ సమీపంలోని పోచంపల్లి గుట్టల దగ్గర జరుగుతుంది. ఈ షూట్‌లో బాలయ్య బిజీగా గడుపుతున్నాడు.



రవితేజ, శ్రీ లీల జంటగా.. భాను భోగవర‌పు డైరెక్షన్‌లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ మాస్ జాత‌ర‌. ఈ సినిమా షూటింగ్ ముచ్చింతలలో శరవేగంగా జరుగుతుంది. ఇక అక్కినేని యంగ్ హీరో అఖిల్ హీరోగా.. మురళీకృష్ణ డైరెక్షన్‌లో రూపొందుతున్న లెనిన్ మూవీ ముచ్చింతలోనే షూట్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.

 

సాయిధరమ్ తేజ్ హీరోగా.. నిరంజన్ రెడ్డి డైరెక్షన్‌లో సంబరాలు ఏటిగట్టు షూటింగ్ జరుగుతుంది. తుక్కగూడలో ఈ సినిమా షూట్ ను శ‌ర‌వే గంగా పూర్తి చేస్తున్నారు టీం. ఇక గ‌తేడాది సంక్రాంతి బ‌రిలో హనుమాన్‌తో సందడి చేసి బ్లాక్ బస్టర్ కొట్టిన తేజ.. మీరాయ్‌తో ఆడియన్స్‌ను పలకరించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శంషాబాద్ లో జరుగుతుంది.



సిద్దు జొన్నలగడ్డ హీరోగా నీరజ కోన డైరెక్షన్లో రూపొందుతున్న మూవీ తెలుసు కదా. ఈ సినిమా షూటింగ్ బాచుపల్లి లో జరుగుతుంది. నాగచైతన్య హీరోగా విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు డైరెక్షన్‌లో రూపొందుతున్న సినిమా షూట్.. అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ బ్యాక్ సైడ్ ఏరియాలో జరుపుకుంటున్నారు. వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో రూపొందుతున్న సినిమా షూటింగ్.. అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: