మంచు విష్ణు ఏ సినిమా చేసిన ఈ మధ్యకాలంలో ట్రోలింగ్ కి గురవుతున్న సంగతి మనకు తెలిసిందే.ముఖ్యంగా oవర్గం నెటిజన్స్ సోషల్ మీడియాలో వీరిపై ట్రోల్స్ తెగ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న #సింగల్ మూవీకి సంబంధించిన ట్రైలర్ లో కన్నప్ప మూవీ లోని శివయ్యా అనే డైలాగ్ ని వాడుకున్నారని,అలాగే ఒక బూతు పదం స్థానంలో మంచు కురిసిపోతుంది అంటూ మంచు ఫ్యామిలీ పేరు కూడా అసభ్యంగా వాడుకున్నారని సోషల్ మీడియాలో రూమర్లు వినిపించాయి. అయితే ఈ విషయం లో మంచు విష్ణు లీగల్ గా శ్రీ విష్ణు సినిమాపై,శ్రీ విష్ణు పై యాక్షన్ తీసుకొని టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి కంప్లైంట్ చేయబోతున్నారనే వార్తలు కూడా వినిపించాయి. అయితే మంచు విష్ణు, శ్రీ విష్ణు సినిమాపై యాక్షన్ తీసుకుంటారని ఎప్పుడైతే వార్తలు వినిపించాయో అప్పటినుండి ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 

అయితే తాజాగా ఈ విషయంపై శ్రీ విష్ణు దగ్గరికి చేరడంతో వెంటనే స్పందించిన శ్రీ విష్ణు కన్నప్ప మూవీ యూనిట్ కి క్షమాపణలు తెలియజేశారు. మేము కన్నప్ప సినిమా గురించి మా సినిమాలో తప్పుగా చూపించామని ప్రచారం చేస్తున్నారు. అయితే మేము ఇతర హీరోల సినిమాల నుండి రిఫరెన్స్ గా తీసుకొని కొన్ని సన్నివేశాలను మా సినిమాలో యాడ్ చేశాము. కానీ ఎవరిని కించపరచడానికి మాత్రం కాదు.సినిమా ఇండస్ట్రీ వారంతా ఒక కుటుంబంలా ఉంటాం. ఒకరిని ఒకరం బాధ పెట్టుకోవాలి అనే ఉద్దేశం లేదు.మా సినిమా కారణంగా ఎవరైనా బాధపడి ఉంటే వెంటనే క్షమించండి. ఇలాంటివి ఇంకొకసారి జరగకుండా చూసుకుంటాం. 

కన్నప్ప మూవీ యూనిట్ కి మా చిత్ర యూనిట్ నుండి క్షమాపణలు తెలియజేస్తున్నాం. అలాగే సోషల్ మీడియాలో ఏ డైలాగులపై అయితే ట్రోలింగ్ జరుగుతుందో ఆ డైలాగులకు సంబంధించి సీన్స్ మా సినిమాలో ఉండవు. వాటిని సినిమా నుండి పూర్తిగా తొలగించాము.మేము ఉద్దేశపూర్వకంగా ఈ పని మాత్రం చేయలేదు అంటూ శ్రీ విష్ణు తాజాగా ఒక వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం శ్రీ విష్ణు పోస్ట్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో మంచు విష్ణు  దెబ్బకి శ్రీ విష్ణు గిలగిలా కొట్టుకుని వెంటనే కన్నప్ప మూవీ టీం కి క్షమాపణలు తెలియజేశారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: