
నిజానికి అన్ని కరెక్ట్ గా కుదిరి ఉంటే ఈపాటికి అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఓ సినిమాను తెరకెక్కించాలి. పుష్ప 2 సినిమా చేస్తున్న మూమెంట్ లోనే అల్లు అర్జున్ తో ఒక సినిమాకి సైన్ చేయించుకున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాసరావు . పక్కాగా అన్ని ముందుకు వెళ్లుంటే ఈపాటికి సినిమా సగం షూటింగ్ కంప్లీట్ అయి ఉండేది . కానీ ఊహించని చిక్కుల్లో బన్నీ ఇరుక్కున్న తర్వాత ఇప్పుడు ఇలాంటి సినిమా కన్నా కూడా బన్నీ ఇమేజ్ ని డబుల్ చేసే సినిమా ఉంటేనే బెటర్ అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకున్నారు. అదేవిధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కూడా బన్నీ కెరీర్ కు ప్లస్ గా మారి అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాను ఓకే చేయమంటూ సజెషన్ ఇచ్చారు.
అయితే చాలామంది ఎందుకు త్రివిక్రమ్ ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడు..? అంటూ ఫైర్ అయ్యారు . బన్నీతో సినిమాను తెరకెక్కించుంటే ఆయనకి మంచి హిట్ పడేదిగా . "గుంటూరు కారం" తర్వాత ఆయన పేరుపై ఎంత నెగిటివిటీ వచ్చిందో అందరికీ తెలిసిందే. బన్నీతో సినిమా చేసుంటే సూపర్ డూపర్ హిట్ పడి ఉండేది. తద్వారా త్రివిక్రమ్ పేరు మళ్ళీ ఫామ్ లోకి వచ్చి ఉండేది అని మాట్లాడుకున్నారు . కానీ త్రివిక్రమ్ తన పేరు మారుమ్రోగిపోవడం కన్నా కూడా పక్క హీరో లైఫ్ సెటిల్ అవ్వడమే ఇంపార్టెంట్ అనుకునే టైప్. ఆ కారణంగానే అట్లీ - బన్నీ కాంబో సెట్ అయ్యేలా చేశాడు . అయితే ఇప్పుడు బన్నీతో సినిమా లేట్ అవ్వడం త్రివిక్రమ్ కి మంచి నిర్ణయమే అయ్యిం . ఒకవేళ బన్నీతో త్రివిక్రమ్ సినిమాను తెరకెక్కించేసి ఉంటే వెంకటేష్ తో సినిమా తెరకెక్కించే ఆలోచన అసలు త్రివిక్రమ్ కి వచ్చి ఉండేదే కాదు అంటూ ఫన్నీ మీమ్‌స్ తో ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. బన్నీతో సినిమా తెరకెక్కిస్తే హిట్ పడి ఉండేది పాజిటివ్ రివ్యూ వచ్చుండేది.. కాని వెంకటేష్ తో సినిమా తెరకెక్కిస్తే మాత్రం వేరే లెవెల్ హిట్ త్రివిక్రమ్ అందుకున్నట్లే ..అది ఎందుకో కూడా అందరికీ తెలుసు..!