దేవర చిత్రంతో బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలలో తన మార్కెట్ ని పదిలంగా ఉంచుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే తన నెక్స్ట్ టార్గెట్ బాలీవుడ్ అన్నట్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే బాలీవుడ్ లో హృతిక్ రోషన్ నటిస్తున్న వార్2 సినిమాలో నటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతున్నది. ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. అందుకే ఈ సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.


ఇదంతా ఇలా ఉండగా ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం తెలుగులో భారీగా డిమాండ్ ఏర్పడిందని సినిమా టాక్ తో సంబంధం లేకుండా ఎన్టీఆర్ వల్ల ఈ సినిమాకి ఫస్ట్ డే కలెక్షన్స్ భారీగా వచ్చేలా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ హిట్ టాకు వస్తే కనుక కలెక్షన్స్ విషయంపై ఎవరు ఊహించని విధంగా వస్తాయని గతంలో కూడా అందుకు సంబంధించి ఎన్నోసార్లు రుజువయిందని చెప్పవచ్చు.. టాలీవుడ్ కు చెందిన బడ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్ వారు వార్ 2 తెలుగు రైట్స్ ని కొనుగోలు చేశారనే విధంగా వార్తలు వినిపించాయి.

నాగ వంశీ ఎన్టీఆర్ ఫ్యాన్ కావడం చేత ఈ విషయం పైన క్లారిటీ ఇస్తూ వార్ 2 సినిమా హక్కులను కొనుగోలు చేయలేదని.. తమ మీద వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని తెలిపారు. మా ప్రాజెక్టులకు సంబంధించి ఏదైనా విషయాన్ని కూడా తమ సొంత ట్విట్టర్ ఖాతా నుంచే ప్రకటిస్తామని దయచేసి బయట వినిపించిన వార్తలను ఎవరు కూడా నమ్మకండి అంటూ తెలియజేశారు. కానీ వార్ 2 సినిమా హక్కుల కోసం ఏషియన్ సమస్త కూడా పోటీపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: