టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఒకానొక సమయంలో హీరోయిన్లు ఎంతో సంప్రదాయంగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలలో మాత్రమే నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకునేవారు. అలాంటి వారిలో నటి బిందు మాధవి ఒకరు. ఈమె తెలుగులో అతి తక్కువ సమయంలోనే తన సినిమాలతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. బిందు మాధవికి విపరీతంగా అభిమానులు ఉండేవారు. ఈ బ్యూటీ దాదాపు 15 ఏళ్ల పాటు సినీ ఇండస్ట్రీని తన సినిమాలతో ఆకట్టుకుందని చెప్పవచ్చు. బిందు మాధవి తెలుగుతోపాటు తమిళంలోనూ అనేక సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుతుంది. 

ఆ తర్వాత ఏమైందో తెలియదు కొన్ని రోజులపాటు ఎలాంటి సినిమాలలో నటించకుండా సైలెంట్ అయిపోయింది. రీసెంట్ గా తెలుగు బిగ్ బాస్ ఓటిటిలోకి బిందు మాధవి అడుగుపెట్టి విజేతగా ట్రోఫీని అందుకుంది. బిందు మాధవి "దండోరా" అనే తెలుగు సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని అందుకున్నట్టుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాలో బిందు మాధవి వేశ్యపాత్రలో కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ విషయం సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇందులో బిందు మాధవి కొన్ని బోల్డ్ సీన్స్ లో నటించబోతుందని, తన కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా బోల్డ్ సన్నివేశాలు చేయడానికి మాధవి సిద్ధమైందని ఓ వార్త వైరల్ గా మారింది. ఈ విషయం తెలిసి బిందు మాధవి అభిమానులు కాస్త సీరియస్ అవుతున్నారు. మరి ఈ సినిమాలో బిందు మాధవి నటిస్తుందా లేదా అనే సందేహంలో తన అభిమానులు ఉన్నారు. ఇదిలా ఉండగా.... ప్రస్తుతం బిందు మాధవితమిళ్ హీరోతో సీక్రెట్ గా ఎఫైర్ కొనసాగిస్తుందట. అంతేకాకుండా ఆ హీరోను త్వరలోనే వివాహం చేసుకోవాలని అనుకుంటున్నట్లుగా సినీ వర్గాల్లో ఓ వార్త వైరల్ అవుతోంది. వీరి ప్రేమ విషయాన్ని ఇరు కుటుంబ సభ్యులకు చెప్పగా వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం అందుతుంది. ఈ విషయం పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: