
కానీ శోభిత ధూళిపాళ్ల చాలా ఓపిక సహనం తో ఉండింది. ఎవరు ఎంత టార్చర్ చేసినా ఆమె మాత్రం ఎప్పుడు వాటిపై నెగటివ్గా స్పందించింది లేదు . తను ..తన కెరీయర్ .. తన భర్త అంటూ ముందుకు వెళ్ళిపోతూ వస్తుంది . సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే శోభిత ధూళిపాల తాజాగా ఓ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ అభిమానులకి బాగా నచ్చేసింది . దీంతో ఆమె భజన ప్రారంభించారు. మరీ ముఖ్యంగా ఎప్పుడు శోభిత ధూళిపాళ్లను హేట్ చేసే జనాలు కూడా ఇప్పుడు అక్కినేని ఇంటికి కోడలు అనిపించావ్ అంటూ మెచ్చుకుంటున్నారు.
దానికి కారణం ఆమె పద్ధతిగా చీర కట్టుకొని కనిపించడమే. ఎప్పుడు కూడా చీర కట్టిన ఆమె ఎక్స్పోజింగ్ చేస్తూ వచ్చేది .. లేకపోతే ఏదో ఒక విధంగా మైనస్ గా మారేది . కానీ ఈసారి మాత్రం శోభిత ధూళిపాల చాలా చాలా ట్రెడిషనల్ గా ఆకర్షణీయంగా కనిపించింది . అక్కినేని ఇంటికి కోడలు అని ఇప్పుడు అనిపిస్తున్నావ్ శోభిత ధూళీపాళ్ళ అంటూ చాలామంది పొగిడేస్తున్నారు . ఆమె లేటెస్ట్ పిక్స్ ని సోషల్ మీడియా లో బాగా వైరల్ చేస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్..అదే విధంగా ఆమె అభిమానులు. కాగా శోభిత పెళ్లి తరువాత కూడా సినిమాలు చేస్తుంది..!!