టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి నటన, అందంతో మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. అలాంటి వారిలో నటి పూజ హెగ్డే ఒకరు. ఈ చిన్నది చిత్ర పరిశ్రమకు పరిచయమైన అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒక లైలా కోసం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును పొందింది. ఆ సినిమా అనంతరం వరుసగా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఇక అలా వైకుంఠపురం సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించిన ఈ భామ బుట్ట బొమ్మగా ప్రేక్షకుల మనసులను దోచుకుంది. 

అలా వైకుంఠపురం సినిమా తర్వాత పూజా హెగ్డేకు వరుసగా సినిమా అవకాశాలు వస్తాయని తన అభిమానులు అంత భావించారు. కానీ అంతా రివర్స్ అయిపోయింది. ఈ భామకు సినిమాలలో ఎలాంటి అవకాశాలు రాకుండా పోయాయి. తెలుగులో ఏవో కొన్ని సినిమాలలో మాత్రమే నటిస్తోంది. బాలీవుడ్ లో మాత్రం వరుసగా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల మనసులను దోచుకుంటుంది. వరుసగా హిందీలో సినిమాలు చేసుకుంటూ సక్సెస్ఫుల్ స్టార్ హీరోయిన్ గా బాలీవుడ్ లో తన సత్తాను చాటుతోంది. తెలుగు, హిందీతో పాటు తమిళంలోని పూజ హెగ్డే అనేక సినిమాలలో నటిస్తోంది. ఈ మధ్య కాలంలో పూజ హెగ్డే నటించిన సినిమాలన్నీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంటున్నాయి.

దీంతో పూజ హెగ్డే నటించిన ప్రతి ఒక్క సినిమా ఫ్లాప్ అవుతుందని తన అభిమానులు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ వార్తలపై పూజ హెగ్డే స్పందించినప్పటికీ "రెట్రో" మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ రియాక్ట్ అయ్యారు. నెటిజన్లు అనుకున్న విధంగా ఏమీ ఉండదని అవన్నీ మూఢనమ్మకాలు అని చెప్పాడు. ఇది కేవలం వారి ఊహ మాత్రమే అని తెలిపాడు. ఇందులో ఎలాంటి వాస్తవం ఉండదు. సినిమా ఫ్లాప్ అవ్వడానికి ఎన్నో కారణాలు ఉంటాయని సంతోష్ వెల్లడించారు. కాగా పూజ హెగ్డే రీసెంట్ గా నటించిన రెట్రో సినిమా ఈరోజు రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాతో అయినా పూజ హెగ్డే సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: