మహానటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ భామ నేను శైలజ సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. ఈ సినిమా అనంతరం తెలుగు సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందింది. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగిస్తుంది. ఇక కీర్తి సురేష్ తెలుగుతో పాటు హిందీ, తమిళ్, ఇలా అనేక భాష సినిమాలలో నటిస్తూ అభిమానుల మనసులను దోచుకుంటుంది. 

కీర్తి సురేష్ గత కొద్ది రోజుల క్రితమే వివాహం చేసుకుంది. తన చిన్ననాటి బాయ్ ఫ్రెండ్ ఆంటోనీ తట్టిల్ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది. వివాహం తర్వాత కూడా ఈ భామ వరుసగా సినిమాలలో నటిస్తూ తన అభిమానులను ఆకట్టుకుంటుంది. కీర్తి సురేష్ తన గ్లామర్ డోస్ ను విపరీతంగా పెంచేసింది. సోషల్ మీడియాలో తనకు సంబంధించిన అందమైన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకోగా అవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా తనకు తన కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకోగా అవి హాట్ టాపిక్ గా మారుతాయి.

ఇక కీర్తి సురేష్ తన కెరీర్ లో అనేక సినిమాలలో నటించి గుర్తింపు పొందింది. ఇక కీర్తి సురేష్ హీరో దిలీప్ కుమార్ తో కలిసి అనేక సినిమాలలో నటించింది. అయితే దిలీప్ కుమార్ కీర్తి సురేష్ కు తండ్రిగా, బాయ్ ఫ్రెండ్ గా, భర్తగా ఇలా మూడు పాత్రలలో కీర్తి సురేష్ తో కలిసి నటించారు. అది కూడా మలయాళ సినిమా కావడం విశేషం కుబేరన్ సినిమాలో దిలీప్ కి కూతురు పాత్రలో కీర్తి సురేష్ నటించింది. మరో సినిమాలో ప్రియురాలిగా, ఇంకో సినిమాలో భార్యగా నటించింది. ఈ విషయం సోషల్ మీడియా మాధ్యమాల్లో సంచలనంగా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: