
అప్పట్లో నగ్మా అందాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పవచ్చు. ఈమె అందం, అభినయంతో అందాల ఆరబోతతో అందరిని ఆకట్టుకునేది. ఎంత పెద్ద స్టార్ హీరోలైనా సరే నగ్మా నటిస్తోందంటే చాలు ఫోకస్ అంతా కూడా ఈ మేమైతే ఉండేలా చేసుకునేది.ముఖ్యంగా పాత్ర హైలెట్ అయ్యేలా నటిస్తూ ఉంటుంది నగ్మా. అలా చిరంజీవి, నగ్మా కాంబినేషన్లో ఘరానా మొగుడు, ముగ్గురు మొనగాళ్లు, రిక్షావోడు తదితర చిత్రాలు విడుదలయ్యాయి. నగ్మా తో డాన్స్ వేయగలిగిన ఏకైక హీరో అంటే అప్పట్లో చిరంజీవి మాత్రమే అన్నట్లుగా అభిమానులు మాట్లాడుకునేవారు.
రిక్షావోడు సినిమా షూటింగ్ సమయంలో నగ్మా చిరంజీవికే సైతం చుక్కలు చూపించిందట. డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నగ్మా మెయిన్ హీరోయిన్ గా నటించగా సౌందర్య సెకండ్ హీరోయిన్గా కనిపించింది. నగ్మా ఇందులో ఒక బడ రాజకీయ నాయకుడు కూతురుగా తగల పొగరు ఉండే పాత్రలో నటించింది. ఈమె పాత్రలో లీనమైపోయి చిరంజీవితో పెద్ద గొడవ పెట్టుకుందట.ఇది రామనాయుడు స్టూడియోలో జరిగిందట. అలా షూటింగ్ అయిపోగానే సినిమా సెట్ నుంచి వెళ్లిపోయిన నగ్మా ఈ విషయం చూసిన అక్కడే చిత్ర బృందానికి ఆశ్చర్యం కలిగింది..కానీ చిరంజీవి మాత్రం నగ్మా దగ్గరికి వెళ్లి మరి జరిగింది చెప్పి.. ఏం మ్యాజిక్ చేశారో కానీ చివరికి ఆమె నవ్వుకుంటూ మరి సినిమా షూటింగ్లో పాల్గొనిందట. ప్రస్తుతం నగ్మా సినిమాలకు దూరంగా ఉంటూ పొలిటికల్ పరంగా యాక్టివ్ గానే ఉంది. ఇప్పటికీ ఈమె పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉన్నది.