టాలీవుడ్ నటి సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. అనేక సినిమాలలో నటించిన సమంత ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలనూ తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకు సమంత ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో నటించి గొప్ప పేరు ప్రఖ్యాతలు దక్కించుకుంది. రీసెంట్ గానే ఈ చిన్నది బాలీవుడ్ లో వెబ్ సిరీస్ లలో నటించి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన సత్తాను చాటుకుంటుంది. ఇదిలా ఉండగా.... సమంత హీరోయిన్ గా మాత్రమే కాకుండా నిర్మాతగాను మారారు. 

తన నిర్మాణ సంస్థలో శుభం సినిమాకు నిర్మాతగా వ్యవహరించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంటున్నారు. శుభం సినిమా మే 7వ తేదీన రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే నిన్న వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు సమంత హాజరయ్యారు. అందులో భాగంగా సమంత మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. ఏ మాయ చేసావే, మజిలీ లాంటి సినిమాలు తనకు మంచి విజయాన్ని అందించాయని అక్కడి ప్రజలు తనను ఎంతగానో ఆదరించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించారని సమంత వెల్లడించారు. వైజాగ్ వేదికగా తనకు సంబంధించిన ఎలాంటి ఫంక్షన్ జరిగినా అవి మంచి విజయాలను అందుకున్నాయని సమంత అన్నారు.

వైజాగ్ అంటే తనకు సెంటిమెంట్ అయిపోయిందని చెప్పారు. శుభం సినిమా కూడా మంచి విజయాన్ని అందించాలని సమంత కోరారు. కాగా నటి శోభిత సొంత ఊరు కూడా వైజాగ్ కావడం విశేషం. తన సొంత ఊరిలోనే సమంత తన పరువు తీసిందని వైజాగ్ వాసులు అంటున్నారు. సమంత హాష్ శునకంతో శోభిత వెనకనుంచి ఫోటోను దిగి సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో అది విపరీతంగా వైరల్ గా మారింది. ఆ ఫోటో తీసుకోవడం వల్ల సమంత చాలా బాధపడిందట. తనపై ఎలా అయినా పగ తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే శోభిత సొంత ఊరిలో ఈవెంట్ నిర్వహించి అలా మాట్లాడిందని కొంతమంది అంటున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: