తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది హీరోయిన్లు మాత్రమే అదృష్టం కలిసి వచ్చి సినీ పరిశ్రమలో సక్సెస్ఫుల్ హీరోయిన్లుగా వారి సత్తాను చాటుతారు. అలాంటి వారిలో నటి అనుష్క శెట్టి ఒకరు. ఈ భామ పేరుకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకానొక సమయంలో తెలుగు ఇండస్ట్రీలో తన సినిమాల ద్వారా ఎంతో పాపులారిటీని సంపాదించుకుంది. పెద్దపెద్ద స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అనుష్క నటించిన సినిమాలన్నీ దాదాపుగా బ్లాక్బస్టర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. ఈ భామ దాదాపు సినీ ఇండస్ట్రీని 20 ఏళ్ల పాటు ఏలిందని చెప్పవచ్చు. 

ఈ మధ్యకాలంలో అనుష్క పెద్దగా సినిమాలలో నటించడం లేదు. వయసు మీద పడడంతో అనుష్కతో సినిమాలు చేయడానికి ఎవరు ముందుకు రాలేకపోతున్నారు. ఏవో కొన్ని సినిమాల్లో మాత్రమే నటిస్తూ తన కెరీర్ ను సాఫీగా కొనసాగిస్తోంది. అనుష్క శెట్టి వయసు 40కి పైనే ఉన్నప్పటికీ ఇంతవరకు వివాహం చేసుకోకుండా సింగిల్గానే తన లైఫ్ కొనసాగుతోంది. సినిమాలలో హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలో ఎంతోమంది హీరోలు, నిర్మాతలతో ఎఫైర్ పెట్టుకున్నట్లుగా, వివాహం కూడా చేసుకోవాలని అనుకుంటున్నట్లుగా అనేక రకాల వార్తలు వైరల్ అయ్యాయి. కానీ అందులో అనుష్క ఎవరిని కూడా వివాహం చేసుకోకుండా సింగిల్ గానే ఉండిపోయింది. ఈ మధ్యకాలంలో అనుష్క శెట్టి వివాహం ఫిక్స్ అయిందని త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందని అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.

దానిపై అనుష్క ఇంతవరకు స్పందించలేదు. ఈ క్రమంలోనే ఓ ప్రముఖ క్రికెటర్ తో అనుష్క వివాహం ఫిక్స్ అయినట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. చాలా కాలం నుంచి సీక్రెట్ గా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారట. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు వివరించగా వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది. దీంతో త్వరలోనే ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరగనున్నట్లుగా సినీ ఇండస్ట్రీలో జోరుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ క్రికెటర్ ఎవరు, ఏంటి అనే విషయాలు బయటకు రానప్పటికీ ఈ భామ వివాహం ఫిక్స్ అయిందని తెలిసి తన అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రికెటర్ ఎవరు ఏంటి అని తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ అనుష్కకు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: