తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి నటనతో మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. అలాంటి వారిలో ప్రముఖ నటుడు ఉపేంద్ర ఒకరు. ఈ హీరో గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ హీరో తెలుగులో అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు. తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ లోనూ అనేక సినిమాలలో నటించి ప్రేక్షకుల మనసులను దోచుకున్నాడు. 


ఉపేంద్ర హీరోగా మాత్రమే కాకుండా దర్శకుడిగా అనేక సినిమాలకు దర్శకత్వం వహించాడు. తన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. వయసు పెరిగినప్పటికీ ఉపేంద్ర ఇప్పటికీ సినిమాలలో నటిస్తూ తన హవాను కొనసాగిస్తున్నారని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా.... గత కొన్ని రోజుల నుంచి ఉపేంద్ర ఆరోగ్యం క్షీణించిందని అనేక రకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తలను ఉపేంద్ర ఖండించారు. తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని చెప్పాడు.

తన ఆరోగ్యం గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ ఉపేంద్ర సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. సాధారణ ఆరోగ్య పరీక్షల కోసం మాత్రమే తాను హాస్పిటల్ కి వెళ్లినట్లుగా ఉపేంద్ర వెల్లడించాడు. గత కొంతకాలం నుంచి ఉపేంద్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడని, ఆసుపత్రిలో ప్రత్యేక చికిత్సలు తీసుకుంటున్నాడని కన్నడ మీడియాలో అనేక రకాల వార్తలు ప్రసారమయ్యాయి.

ముఖ్యంగా 'యుఐ' సినిమా చిత్రీకరణ సమయంలో ఉపేంద్రకు అనారోగ్య సమస్యలు వచ్చాయని అవి ఇప్పుడు మరింత ఎక్కువ అయ్యాయని కన్నడ మీడియా మాధ్యమాల్లో వార్తలు వైరల్ అయ్యాయి. ఆ వార్తలన్నీ కేవలం అవాస్తవమని ఉపేంద్ర స్పష్టం చేశారు. ఉపేంద్ర ఆరోగ్యం క్షేమంగా ఉందని తెలిసి తన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఉపేంద్ర పలు సినిమా షూటింగ్ లలో బిజీగా ఉన్నారు. ఈ విషయం పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: