టాలీవుడ్ ప్రముఖ నటి రహస్య గొరక్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ భామ తెలుగులో 2016 సంవత్సరంలో "ఆకాశమంత ప్రేమతో" అనే తెలుగు సినిమాతో చలనచిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకున్న రహస్య ఆ సినిమా అనంతరం "రాజా వారు రాణి గారు" సినిమాలో నటించి మంచి గుర్తింపు అందుకుంది. ఆ సినిమాతో ప్రేక్షకుల మనసులను దోచుకున్న ఈ చిన్నది వరసగా సినిమాలలో అవకాశాలను అందుకుంది. ఆ సినిమాలో రహస్య ప్రముఖ నటుడు కిరణ్ అబ్బవరంతో కలిసి  నటించింది. 


సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అతి తక్కువ సమయంలోనే ఆ స్నేహం ప్రేమగా మారడంతో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహాన్ని జరుపుకున్నారు. వివాహం తర్వాత రహస్య సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఎలాంటి సినిమాలలోనూ నటించడం లేదు. తన వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. తన భర్త నటించిన సినిమా షూటింగ్ వ్యవహారాలను దగ్గరుండి మరీ చూసుకుంటుంది. ఇక ఈ జంట గత సంవత్సరం ఆగస్టు నెలలో వివాహం చేసుకున్నారు.

వివాహం తర్వాత అతి తక్కువ సమయంలోనే రహస్య, కిరణ్ అబ్బవరం దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నామని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈరోజు రహస్య సీమంతం ఫంక్షన్ జరిగింది. ఈ ఫంక్షన్ కు సంబంధించిన ఫోటోలను రహస్య తన ఇన్ స్టా అకౌంట్ వేదికగా షేర్ చేసుకోగా అవి వైరల్ అవుతున్నాయి. సీమంతం ఫంక్షన్ చాలా ఘనంగా జరిపించినట్టుగా చూస్తేనే అర్థమవుతోంది. అందులో రహస్య చాలా సాంప్రదాయంగా కుందనపు బొమ్మల కనిపించి తన అభిమానులను ఆకట్టుకుంటుంది.


బ్లూ కలర్ సారీ ధరించి నగలను వేసుకొని అచ్చ తెలుగు అమ్మాయి వలె కనిపిస్తోంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు కిరణ్ అబ్బవరం, రహస్యకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పలువురు సినీ ప్రముఖులు కూడా స్పెషల్ విషెస్ తెలియజేస్తున్నారు. ఈ కామెంట్ పైన కిరణ్ అబ్బవరం, రహస్య ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: