తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి నటనతో మంచి గుర్తింపు అందుకుంటారు. అలాంటి వారిలో ప్రముఖ నటుడు నాని ఒకరు. అష్టా చమ్మా సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో తనదైన సినిమాలతో ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు. ఇప్పటివరకు తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించిన నాని స్టార్ హీరోగా గుర్తింపు అందుకున్నాడు. ఈ హీరో నటించిన తాజా చిత్రం హిట్ 3. 

సినిమా కోసం నాని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన రెండు సిరీస్ లు మంచి విజయాలను అందుకున్నాయి. హిట్-3 కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటించారు. ఈ సినిమాలో నాని, శ్రీనిధి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలిచాయి. కాగా ఈ సినిమా సక్సెస్ అయిన నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ క్రమంలోనే ఈవెంట్ కు హీరో హీరోయిన్ అందరూ హాజరయ్యారు. 

అందులో భాగంగా హీరో నాని మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. సినిమా సక్సెస్ చేసినందుకు తన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాకుండా పాకిస్తాన్ లో జరిగే యుద్ధం వల్ల నా సినిమా సక్సెస్ ఈవెంట్ క్యాన్సల్ అవుతుందని ప్రతి ఒక్కరూ అనుకున్నారు. కానీ అలా చేసినట్లయితే యుద్ధం వల్ల హిట్ సినిమా సక్సెస్ ఈవెంట్ క్యాన్సల్ అయిందని సాటిస్ఫాక్షన్ పాకిస్తాన్ వారికి ఉంటుంది. అలా వారికి ఛాన్స్ ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే హిట్ 3 సినిమా సక్సెస్ ఈవెంట్ ని ఇలా ప్లాన్ చేశామని నాని మాట్లాడారు. ప్రస్తుతం నాని మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: