సమంత రీసెంట్ గా మలయాళం లో హేమ కమిటీ వేసిన సమయంలో టాలీవుడ్ లో కూడా ఇలాంటి ఒక కమిటీ ఉంటే బాగుండు ఇలాంటి ఓ కమిటీ వేయండి అంటూ రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ ఒక పోస్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే.ఇక సమంత పోస్టుతో టాలీవుడ్ లో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉంది అని అందరికీ అర్థమైంది.అంత పెద్ద హీరోయినే క్యాస్టింగ్ కౌచ్ పై ఓ కమిటీ వేయండి అని అడిగిందంటే ఇండస్ట్రీలో ఎంత క్యాస్టింగ్ కౌచ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే సమంత క్యాస్టింగ్ కౌచ్ వ్యాఖ్యలపై ఓ నటుడు మాత్రం చాలా బాధపడ్డారు. మరి ఇంతకీ ఆయన ఎవరయ్యా అంటే శివాజీ రాజా.. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లలో ఇలా ఎన్నో పాత్రలు పోషించిన శివాజీ రాజా గతంలో మా ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో ఇండస్ట్రీ నుండి కొంతమంది స్టార్ హీరోయిన్స్ వచ్చి ఇండస్ట్రీలో జరుగుతున్న క్యాస్టింగ్ కౌచ్ పై కంప్లైంట్ చేశారట. 

అయితే ఇలా కంప్లైంట్ చేసిన వారిలో సమంత కూడా ఉందట. ఆరోజు సమంత కంప్లైంట్ చేయడానికి మా అసోసియేషన్ కి వచ్చిన సమయంలో శివాజీ రాజా చాలా బాధపడ్డారట. ఇంత పెద్ద హీరోయిన్ వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేస్తుందంటే ఆమె ఎంత బాధ అనుభవిస్తే ఇక్కడికి వచ్చింది..సమంత మాత్రమే కాదు ఎంతో మంది హీరోయిన్లు ఇలా మా అసోసియేషన్ లో ఇండస్ట్రీలో ఉన్న కొంత మందిపై కంప్లైంట్ చేస్తున్నారు అంటూ  శివాజీ రాజా బాధపడ్డారట. అలా శివాజీ రాజా సమంత చేసిన వ్యాఖ్యలపై బాధపడడం గురించి రీసెంట్ గా ఓ టాక్ షో లో చెప్పుకొచ్చారు.అంతేకాదు శివాజీ రాజా తన పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకున్నారు..

 తనకు నక్సలిజం అంటే ఇష్టమని,గద్దర్ ని ఎక్కువగా ఇష్టపడడం వల్ల ఆయన ప్రభావం నా మీద ఎక్కువ పడి నక్సలిజంలోకి వెళ్లాలనుకున్నానని, కానీ అనూహ్యంగా సినిమాల్లోకి వచ్చానని, ఒకవేళ నక్సలైట్ అయితే ఇక్కడ మీ ముందు ఇలా ఉండేవాడిని కాదేమో అంటూ శివాజీ రాజా చెప్పుకొచ్చారు. అలాగే ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థపై కూడా షాకింగ్ కామెంట్లు చేశారు. ఎన్నికలు వచ్చాయంటే చాలు ఎంతోమంది రాజకీయ నాయకులు ప్రజలకు ఫ్రీ ఫ్రీ,ఉచిత పథకాలు అంటూ మభ్యపెట్టి మాయ చేసి ఓట్లు వేయించుకుంటున్నారు. ఈ పద్ధతి ఏమాత్రం బాగాలేదు అంటూ రాజకీయ వ్యవస్థపై కూడా కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: