
కాగా బాలయ్య తన సినిమాల విషయంలో ఎప్పుడూ కూడా హీరోయిన్స్ వాళ్లు కావాలి.. వీళ్ళు కావాలి అంటూ డిమాండ్ చేయరట . పూర్తిగా బాధ్యతలను మేకర్స్ పైన పెట్టేస్తారట. వాళ్ళ బడ్జెట్ కి తగ్గట్టు ఏ హీరోయిన్ వచ్చిన ప్రాబ్లం లేదు అనుకునే టైపు బాలయ్య . అయితే ఒక సినిమా విషయంలో మాత్రం బాలయ్య నా సినిమాలో ఆ హీరోయిన్ వద్దు అంటూ తెగేసి చెప్పేసాడట. ఆమె మరి ఎవరో కాదు పూజ హెగ్డే . ఆ సినిమా మరేంటో కాదు"వీర సింహారెడ్డి".
గోపిచంద్ మల్లినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటించింది . హనీ రోజ్ కూడా మరొక హీరోయిన్ గా కనిపించి మెప్పించింది . అయితే శృతిహాసన్ క్యారెక్టర్ కోసం ముందుగా పూజ హెగ్డే ని అనుకున్నారట . కానీ పూజా హెగ్డే అప్పటికే బాలయ్యతో రెండు సార్లు సినిమాలు రిజెక్ట్ చేసిందట . ఆ కారణంగా ఆ హీరోయిన్ వద్దు అన్నాడో.. లేకపోతే వేరే రీజన్ ఏదైనా ఉందో తెలియదు కానీ పూజ హెగ్డే ఈ సినిమాలో వద్దనే వద్దు అంటూ గోపీచంద్ కి చాలా ఘాటుగానే చెప్పేసారట . బాలయ్యని అర్థం చేసుకున్న గోపీచంద్ మల్లినేని తన లక్కీ హీరోయిన్ శృతిహాసన్ కి ఛాన్స్ ఇచ్చాడు . ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అంతేకాదు ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా బ్లాక్ బస్టర్ గా బాక్సాఫీస్ చరిత్రలో నిలిచిపోయేటువంటి కలెక్షన్స్ సాధించాయి..!