
కాజల్ కేవలం హీరోయిన్ గానే కాకుండా స్పెషల్ సాంగ్లలో కూడా నటించింది. కాని కాజల్ అగర్వాల్ కెరియర్ లో నాగార్జునతో కలిసి రెండుసార్లు నటించేందుకు అవకాశాలు వచ్చిన నటించలేక పోయిందట. అలా వీరి కాంబినేషన్లో రావలసిన మొదటి చిత్రం రగడ. ఈ చిత్రంలో అనుష్క శెట్టి, ప్రియమణి నటించారు. అయితే మొదట ఇందులో ప్రియమణి పాత్రలో హీరోయిన్ కాజల్ ని అనుకున్నారట కానీ కొన్ని కారణాల చేత ఆమె రిజెక్ట్ చేయడంతో హీరోయిన్ ప్రియమణి తీసుకోవడం జరిగింది.
ఇక తర్వాత ఆల్మోస్ట్ హీరోయిన్గా ఎంపిక చేసిన చిత్రం ది ఘోస్ట్. ఈ చిత్రంలో కూడా మొదట హీరోయిన్గా కాజల్ అగర్వాల్ ఫిక్సయిన కానీ అది కూడా కుదరకపోవడంతో ఈ చిత్రంలో హీరోయిన్గా సోనాల్ చౌహాన్ ను ఎంపిక చేశారు. అయితే ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోవడం జరిగింది. ఇలా రెండుసార్లు నాగార్జునతో నటించే అవకాశం వచ్చినప్పటికీ కాజల్ అగర్వాల్ మిస్ అయినట్లుగా తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో నాగార్జున చిత్రంలో కాజల్ అగర్వాల్ ఏదైనా కీలకమైన పాత్రలో నటించేలా అవకాశం లభిస్తుందేమో చూడాలి. ఈ మధ్యకాలంలో యంగ్ హీరోయిన్స్ సైతం ఎక్కువగా అవకాశాలు లభిస్తున్న తరుణంలో సీనియర్ హీరోయిన్స్ అవకాశాలు తగ్గుతున్నాయి.