
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సీనియర్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు హీరోయిన్ నుంచి తొలిసారిగా నిర్మాతగా అవతారం ఎత్తి నిర్మించిన సినిమా శుభం. దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల డైరెక్ట్ చేసిన ఈ హర్రర్ కామెడీ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కోసం సమంత వ్యూహాత్మకంగా ప్రమోషన్లు కూడా చేశారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో సినిమా యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. సినిమాకు టాక్ బాగున్న కలెక్షన్లు ఓ మోస్తరు గా వస్తున్నాయి. ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి ప్రపంచ వ్యాప్తంగా శుభం సినిమాకు 5.25 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందని చెబుతున్నారు.
ఈ సినిమాలో హర్షిత్ రెడ్డి - గదిరెడ్డి శ్రీనివాస్ - చరణ్ పేరి - శ్రియకాంతం - శ్రావణి లక్ష్మి - శాలిని తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమా టోటల్ రన్ లో అందరికీ మంచి లాభాలు తెచ్చిపెడుతుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమా ను నైజాం లో మైత్రీ మూవీస్ వాళ్లు .. అటు ఏపీ, సీడెడ్ లో సురేష్ బాబు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. సమంత రిలీజ్ కు ముందే మంచి టేబుల్ ప్రాఫిట్ చేసుకున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు