- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

పాన్ ఇండియ హీరో ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో వస్తున్న సినిమా రాజా సాబ్.. ఈ సినిమా ను మొదట్లో ఎంతో చిన్నగా చూసారు అందరూ ఫ్యాన్స్ తో సహా .  కానీ తర్వాత సీన్ అంత మారిపోయింది .. ఈ సినిమా మీద ఆసక్తి పెరుగుతూ పోయింది .  ఎందుకంటే ప్రధానంగా ప్రభాస్ ను ఇలా కామెడీ జానర్  లో చూసి చాలా కాలం అవుతుంది .  సీరియస్ యాక్షన్ సినిమా లే కాకుండా ఇలాంటి సినిమా చేస్తే వేరే లెవల్లో ఉంటుంద ని ఇప్పుడు అంతా భావిస్తున్నారు .. అయితే రాజా సాభ్‌ సినిమా లో సిజి వర్క్ చాలా అంటే చాలా ఉంది .. సినిమా లో కంప్యూటర్ గ్రాఫిక్స్ ఏఐ క్రియేషన్స్ కు లిమిట్ లేద ని  కూడా తెలుస్తుంది ..


అలాగే ఈ సినిమా కోసం చాలా జంతువు లను ఏఐ లో క్రియేట్ చేశారట వాటి లో గుడ్లగూబలు , పాములు ఇలా ఎన్నో ఉన్నాయి అని కూడా అంటున్నారు . డైరెక్టర్ మారుతి తయారు చేసిన స్టోరీ హర్రర్ కామెడీ .. అయితే ఇందులో ఇలాంటి జంతువులు అన్నీ ఏమిటో ? వాటి తో ఏం చేయబోతున్నారు అన్న ఆసక్తి రోజురోజుకి పెరిగిపోతుంది .. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూట్ హైదరాబాద్ చుట్టుపక్కల జరుగుతుంది .. సంజయ్ దత్ మీద కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు మరికొద్ది రోజుల్లో ప్రభాస్ కూడా ఈ సినిమా షూటింగ్లో  అడుగు పెట్టబోతున్నారు .. ఇలా నెలరోజుల ఈ సినిమా షూట్ పాటలు బ్యాలెన్స్ ఉంది .. అయితే రాజా సాబ్‌ సినిమాను ఈ ఏడాది చివర్లో ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని పీపుల్ మీడియా ప్రయత్నం చేస్తుంది ..

మరింత సమాచారం తెలుసుకోండి: