ప్రస్తుతం వచ్చే సినిమా ఎంత కలెక్ట్ చేసింది ఎన్ని వందల కోట్లు వచ్చాయి .. హీరోను అగ్ర హీరోగా మార్చే ఇవి మాత్రమేనా ? హీరో కెరియర్ లో 100 కోట్ల సినిమా లేకపోతే సూపర్ స్టార్ అవలేడా ? ఇలా అయితే మలయాళ హీరో ముమ్ముట్టిని సూపర్ స్టార్ అనకూడదా ? ముమ్ముట్టి కెరియర్ లో ఎన్నో బ్లాక్బస్టర్స్ ఉన్నాయి .. అయితే ఇప్పటివరకు ఆయన 100 కోట్ల మార్కు అందుకోలేదు .. అయితే అదే ఇండస్ట్రీలో మరికొంతమంది హీరోలు ఆ మార్క్ అందుకున్నారు కానీ వాళ్ళు సూపర్ స్టార్స్ కాదు .. ముమ్ముట్టి మాత్రమే సూపర్ స్టార్ .


ఐదు దశాబ్దాల కెరియర్ లో ముమ్మట్టి టచ్ చేయ‌ని జానర్ లేదు ఆయన చేయని ప్రయోగం లేదు ఇప్పటివరకు 400 కు పైగా సినిమాల్లో ఆయన నటించారు .. మల‌య‌ళ‌ ఇండస్ట్రీలో ముమ్ముట్టికి అతిపెద్ద పోటీ ఇచ్చే హీరో మోహన్‌లాల్ .. ఇంకా బాగా చెప్పాలంటే మోహన్ లాల్ స్థాయిలో ముమ్ముట్టి కమర్షియల్ హిట్స్  కెరియర్లు అందుకోలేదు ఆయన కెరియర్లో భీష్మ పర్వం మాత్రమే పెద్ద హిట్ అయింది .. అది కూడా 100 కోట్ల మార్కు దాటలేదు కానీ ముమ్ముట్టి సూపర్ స్టార్ .. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం ఆయన ఎంచుకొనే స్టోరీలు కూడా అలాంటివి .. అలాగే ఆ సినిమాల్లో ఆయన నటించే పాత్ర కూడా ఎంతో బిన్నంగా ఉంటూ ఆయన్ను ఉత్తమ నటుడుగా మూడుసార్లు నేషనల్ అవార్డులు అందుకునేలా చేశాయి ..


మమ్ముట్టికి కేవలం నటించ‌డం మాత్రమే తెలుసు మిగతా లెక్కలు ఆయనకు పనికిరావు .. అలాగే 1983 లో ఏకంగా ఒకే సంవత్సరంలో 36 సినిమాలు  చేశారు ముమ్ముట్టి .. అలాగే 1984 లో 34 , 1985 లో 28 , 1986 లో 35 సినిమాలో నటించారు .. ఇలా 73 ఏళ్ల వయసు లో కూడా ఇప్పటికీ సంవత్సరాని కి నాలుగు , ఐదు సినిమాలు చేస్తూ తన సినీ జీవితం లో మహుటం లేని మహారాజు గా వెలుగుతున్నారు మమ్ముట్టి .. ఏదైనా ఓ డిఫరెంట్ విలక్షణ పాత్ర చేయాలంటే ఇప్పటికీ అందరికీ గుర్తొచ్చేది ఆయన పేరే అదే ఆయనకు సాధ్యమైన ఘనత అందుకే ఆయన ఎప్పటికీ సూపర్ స్టార్ ..

మరింత సమాచారం తెలుసుకోండి: