
ఇండస్ట్రీలో సినిమాపై అంచనాలు ఉండాలే కానీ దాన్ని కొనే వాళ్ళు ఊరికినే పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు . టాలీవుడ్ లో విరూపాక్ష అనే సినిమా తో ఇండస్ట్రీ చూపును తన వైపు తిప్పుకున్నాడు దర్శకుడు కార్తీక్ దండు .. తన తర్వాత సినిమాను కూడా మళ్లీ అదే మిస్టేక్ థ్రిల్లర్ జానెర్ లో హీరో నాగచైతన్యతో మొదలుపెట్టాడు .. ఏదో జస్ట్ 10 పర్సెంట్ మాత్రమే షూటింగ్ పూర్తయింది .. అయితే ఇప్పుడు ఈ సినిమా కాపీ ఊరికినే అమ్మడైపోయింది .. అంటే వరల్డ్ వైడ్ గా థియేటర్ హక్కులు విక్రయం జరిగిపోయింది .. ఏపీ , సీడెడ్ , నైజాం ఇతర రాష్ట్రాలు ఓవర్సీస్ ఇలా అన్ని థియేటర్ హక్కులు కలిపి హోల్ సెల్గా సితార సంస్థ కొనేసుకుంది .. సితార నాగ వంశీ మంచి ధరకే ఈ డీల్ ను సెట్ చేసుకున్నారు .. దాదాపు 30 నుంచి 35 కోట్ల మధ్యలో అంకెలు వినిపిస్తున్నాయి ..
35 కోట్లు అంటే నిర్మాతకు మంచి డీలనే చెప్పాలి .. అలాగే 30 కోట్ల మేరకు అంటే బయ్యర్ నాగ వంశీ కూడా మంచి డీల్ అనే భావించాలి .. ఈ సినిమా షూటింగ్ పూర్తవడానికి ఇంకా చాలా సమయం పడుతుంది .. ఇక్కడ నాగ వంశీ కనీసం సగం పేమెంట్ అయినా ఇచ్చి దాదాపు ఏడాది వేచి ఉండాలేమో .. వడ్డీలు కూడా లెక్కలు వేసుకోవాల్సి ఉంటుంది . అయితే ఇక్కడ ఏదేమైనా సరే సినిమా మీదే క్రేజ్ ను మరింత పెంచుకుంటూ పోతుంది ఈ డీల్ న్యూస్ .. అయితే ఇదే సమయంలో జాక్ సినిమాను కొన్న వాళ్ళు మాత్రం కొంత కలవరపడతారు .. ఎందుకంటే జాక్ సినిమా బాకీలు వసూలు చేసుకోవడానికి నాగచైతన్య సినిమానే ఆధారం ఈ సినిమాను ముందుగానే అది కూడా పెద్ద పార్టీ అయినా సీతారాకు అమ్మేసారని తెలిస్తే .. ఇక వారు ఏం చేయాలో తెలియక జుట్టు పీక్కుంటారేమో ..