సినిమాలు ఎవ్వరైనా తెరకెక్కిస్తారు. కానీ జనాలను అర్థం చేసుకొని వాళ్ళ నాడి పట్టుకుని సినిమాలు తెరకెక్కించే డైరెక్టర్ లు మాత్రం కొంతమంది ఉంటారు. అయితే అలా తెరకెక్కించిన సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి అన్న రూల్ ఏమి లేదు కొన్ని కొన్ని సార్లు మిస్ ఫైర్ అవుతూ ఉంటాయి . కాగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ లు అనగానే అందరికీ తట్టేది మూడే మూడు పేర్లు . "ఎస్ ఎస్ రాజమౌళి .. సుకుమార్ ..ప్రశాంత్ నీల్" ఈ మూడు పేర్లే బాగా ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. చాలామంది బడా పాన్ ఇండియా స్టార్స్ ఈ ముగ్గురు దర్శకత్వంలో నటించడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు .


అయితే కోట్లాదిమంది ఇండియన్స్ ఎప్పుడు ఎప్పుడు అంటూ వెయిట్ చేసిన ఆస్కార్ అవార్డు ఇండియాకి తీసుకొచ్చిన ఘనత మాత్రం రాజమౌళికే దక్కింది .  ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు వరించింది. ఆస్కార్ అవార్డు ఇండియాకి వచ్చింది అని తెలియగానే జనాల ఆనందం అంతా ఇంత కాదు . ఆ మూమెంట్ ఇండియన్స్ ఎప్పటికీ మర్చిపోలేనిది . కాగా ఆ తర్వాత మళ్లీ ఇండియాకి ఆస్కార్ రావాలి అంటే అది కేవలం రాజమౌళి దర్శకత్వంలో సాధ్యపడుతుంది అని అందరూ జనాలు భావించారు.



కానీ మధ్యలోకి వచ్చాడు ప్రశాంత్ నీల్ సైలెంట్ గా వచ్చి తన రేంజ్ మార్చుకునేశాడు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించే సినిమాలు కూడా బాగా ఉంటాయి అని .. ప్రశాంత్ నీల్ కి కూడా గ్లోబల్ స్థాయి ఇమేజ్ ఉంది అని..  ఆస్కార్ అవార్డు దక్కించుకోవడానికి ఆయన కూడా అర్హుడే అంటూ చాలామంది ప్రశాంత్ నీల్ ని ఓ రేంజ్ లో పొగిడేశారు. అయితే దానికి కౌంటర్స్ కూడా పడ్డాయి. ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఎన్టీఆర్ ని డిఫరెంట్ యాంగిల్ లో చూపించబోతున్నాడు . దానికోసం ఎన్టీఆర్ ఏకంగా 18 కేజీల బరువు తగ్గాడు.  ఈ సినిమాకి డ్రాగన్ అంటూ నామకరణం చేశారు అన్న వార్త బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే ఈ సినిమా ద్వారా ప్రశాంత్ నీల్ ఇండియాకి మరో ఆస్కార్ అవార్డు తీసుకురాబోతున్నాడు అంటూ  ఓ రేంజ్ లో ఫ్యాన్స్ డప్పు కొట్టుకుంటున్నారు. దానికి రాజమౌళి ఫ్యాన్స్ కూడా అదే విధంగా ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు. అంత సీన్ లేదు అని ఇది కేవలం నార్మల్ సినిమానే అని..తలకిందులుగా తప్పసు చేసిన సరే.. ప్రశాంత్ నీల్ కి మాత్రం అది ఎప్పటికి అందని ద్రాక్షనే అంటున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి: