ఏంటి వదినమ్మకు అక్కినేని అఖిల్ నిజంగానే షాక్ ఇచ్చారా.. ఇంతకీ శోభితకు షాక్ ఇచ్చేలా అఖిల్ చేసిన ఆ పని ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. అక్కినేని అఖిల్ కి నాగచైతన్య రెండో భార్య శోభిత ధూళిపాళ్లతో ఎలాంటి రిలేషన్ ఉందో తెలియదు కానీ నాగచైతన్య మొదటి భార్య సమంతతో మాత్రం ఎంతో మంచి బాండింగ్ ఉంది. అప్పట్లో నాగచైతన్య భార్య సమంతతో అఖిల్ మరిదిలాగా కాకుండా ఫ్రెండ్స్ లాగా అక్క తమ్ముళ్ల లాగా ఉండేవారు.అలా వీరిద్దరూ ఎంత సరదాగా దిగిన ఫోటోలు కూడా ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. అయితే నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చాక కూడా సమంతతో ఆ ఫ్రెండ్షిప్ ని కంటిన్యూ చేస్తున్నాడు అక్కినేని అఖిల్. అంతే కాదు సమంత బర్త్డేలకు, ఆమె కొత్త సినిమాలకి అఖిల్ విష్ చేస్తూనే ఉంటాడు. 

అలాగే ఆమె మయోసైటిస్ బారిన పడ్డప్పుడు అనారోగ్యంతో బాధ పడుతున్నప్పుడు త్వరగా కోలుకోవాలి అని పోస్ట్ కూడా చేశారు.ఇక సమంత కూడా అఖిల్ ని ఫ్రెండ్ లాగే భావిస్తూ భర్తకు విడాకులు ఇచ్చినా కూడా భర్త తమ్ముడ తో ఉన్న బాండింగ్ ని మాత్రం మర్చిపోలేదు.. అయితే విడాకులయ్యాక కూడా వీరిద్దరి మధ్య మంచి రిలేషన్ కొనసాగుతోంది. ఇదంతా పక్కన పెడితే ఈ విషయం తెలిస్తే మాత్రం శోభితకి షాక్ తగిలింది అని నెటిజన్లు కామెంట్లు పెట్టక మానరు. ఎందుకంటే అఖిల్ అక్కినేని తన సోషల్ మీడియా ఖాతాలో మాజీ వదినతో దిగిన ఫోటోలు ఏ  ఒక్కటి కూడా డిలీట్ చేయలేదు.

అయితే కొంత మంది సెలబ్రిటీలు విడాకులు అయితే తమ కుటుంబ సభ్యులు కూడా వారితో ఉన్న ఫోటోలను డిలీట్ చేసి బంధాన్ని తెచ్చుకుంటారు.కానీ నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చిన కూడా అఖిల్ మాత్రం సమంత తమ ఫ్యామిలీతో దిగిన ఫోటోలను సోషల్ మీడియా ఖాతాలో అలాగే భద్రపరుచుకున్నారు.ప్రస్తుతం ఈ ఫోటోలు చూసిన చాలా మంది నెటిజన్లు అఖిల్ తన మాజీ వదిన ఫొటోస్ ని డిలీట్ చేయకుండా శోభిత ధూళిపాళ్లకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: