తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అందగత్తెల పోటీలను నిర్వహిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. మొత్తం 76 దేశాల నుంచి అందగత్తెలను మిస్ వరల్డ్ పోటీలకు ఎంపిక చేశారు. గత కొద్ది రోజుల క్రితమే ప్రారంభమైన ఈ పోటీలలో అందగత్తెలు చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ మంత్రులు హాజరవుతున్నారు. ఈ అందగత్తెలను రోజుకు ఒక ప్రదేశానికి తిప్పుతూ వారికి అన్ని ప్రదేశాలను చూపిస్తున్నారు.


 
హైదరాబాద్ లోని పలు ప్రదేశాలను తిప్పి చూపించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో స్పోర్ట్స్ ఫైనల్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు పాల్గొని సందడి చేశారు. అందులో భాగంగా అందగత్తెలు అందరూ కలిసి హీరో ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాలోని ఓ పాటకు స్టెప్పులు వేశారు. తెలంగాణలోని కొన్ని డీజే పాటలకు కూడా సుందరీమణులు అందరూ కలిసి డ్యాన్సులు చేశారు. 

అందులో దేవర సినిమాలోని పాటలకు స్టెప్పులు వేసిన వీడియోలు సోషల్ మీ డియా మాధ్యమా ల్లో వైరల్ గా మారుతున్నాయి. కాగా స్పోర్ట్స్ ఈవెంట్ లో శక్తి సామర్థ్యాలు ప్రదర్శించిన అందగత్తెలు క్వార్టర్ ఫైనల్ కు వెళ్తారు. చివరికి ఎవరు ఇందులో విజయా న్ని సాధిస్తారో చూడాలి. ఇదిలా ఉండగా.... ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అనంతరం ఎన్టీఆర్ దేవర-2 సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. 

దేవర సినిమా మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ఈ సినిమాకు సీక్వెల్ గా దేవర-2ను తీయనున్నారు. మొదటి పార్ట్ సక్సెస్ సాధించింది. ఈ సినిమా షూటింగ్ తొందరలోనే ప్రారంభం కానుంది. ఇందులో ఎన్టీఆర్ హీరోగా నటించగా బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి మరింత సమాచారం తొందరలోనే వెలవడనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: