
థగ్ లైఫ్ ట్రైలర్ విషయానికి వస్తే.. నువ్వు నా ప్రాణం కాపాడీనోడివి.. యముడికి దొరకకుండా వెనక్కి లాగినోడివి అంటూ కమలహాసన్ చెప్పే డైలాగ్ తో థగ్ లైఫ్ ట్రైలర్ మొదలవుతుంది. ఇందులో కూడా కమలహాసన్ గ్యాంగ్ స్టార్ గా కనిపిస్తున్నారు. అతని కుమారుడిగా హీరో శింబు నటిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ ట్రైలర్ మొత్తం గ్యాంగ్ స్టార్ నేపథ్యంలోనే కనిపిస్తోంది.అలాగే ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలెట్గా నిలుస్తోంది. ఇందులో మలయాళ నటుడు కూడా ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. కమలహాసన్ లుక్ చాలా విభిన్నంగా కనిపిస్తోంది. హీరోయిన్ గా త్రిష స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తోంది. అయితే చివరికి కమలహాసన్, శింబు మధ్య వచ్చే సన్నివేశాలు హైలెట్గా నిలుస్తున్నాయి. ట్రైలర్ అయితే అటు అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించేలా కనిపిస్తోంది. మరొక విషయం ఏమిటంటే ఈ సినిమాలో రొమాన్స్ కూడా బాగానే ఉన్నట్టుగా కనిపిస్తోంది.
ట్రైలర్లో ఐశ్వర్య లక్ష్మి, కమలహాసన్ లిప్ లాక్ సన్నివేశాన్ని కూడా చూపించారు. అటు రొమాన్స్ తో ,వైలెన్స్ తో థగ్ లైఫ్ ట్రైలర్ మాత్రం రెస్పాన్స్ భారీగానే లభించింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండీగా మారుతోంది ఈ ట్రైలర్..మరి సినిమాతో ఏ విధంగా మ్యాజిక్ చేస్తారో చూడాలి కమల్ హాసన్. ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే విడుదల చేస్తున్నారు.