
నేచురల్ స్టార్ నాని రీసెంట్ గా హిట్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. వైల్డ్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ సినిమాలో నాని నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తెలుగు ప్రేక్షకులు నానిని సరికొత్తగా చూసి ఫిధా అయ్యారు. నాని తర్వాత సినిమాను దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేసేందుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ది ప్యారడైజ్ అనే టైటిల్తో తెరకెక్కనున్న ఈ సినిమాలో నాని సరికొత్త లుక్స్ తో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. టైటిల్ తోనే నాని అందరి దృష్టిని తన వైపునకు తిప్పేసుకున్నాడు.
ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ సినిమా నుంచి ఒక మార్పు కనిపిస్తోంది. ముందుగా ది ప్యారడైజ్ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించేందుకు జీకే విష్ణును ఈ ప్రాజెక్టులోకి తీసుకున్నారు. అయితే ఇప్పుడు కొన్ని కారణాలవల్ల ఆయనను ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మరో టాప్ సినిమాటోగ్రాఫర్ కోసం ఈ సినిమా యూనిట్ వెతుకు లాటలో ఉంది. ఈ సినిమాలో అందాల భామ కయాదు లోహార్ హీరోయిన్గా నటిస్తుండగా .. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు