నాగచైతన్య .. నాగేశ్వరరావు గారి మనవడిగా నాగార్జున కొడుకుగా తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడానికి. గత కొన్ని సంవత్సరాలుగా కష్టపడుతున్నాడు . అయితే ఇప్పుడిప్పుడే అక్కినేని ఫ్యాన్స్ కోరికలు తీర్చేస్తున్నాడు నాగచైతన్య . ఇన్నాళ్లు నాగచైతన్య అంటే ఒక హీరో అంతే . అలానే మాట్లాడుకునే వాళ్ళు . కానీ ఇప్పుడు నాగచైతన్య అంటే "తండేల్" సినిమాతో హిట్టు కొట్టాడు. 100 కోట్ల క్లబ్ లోకి చేరాడే ఆయనే.. హీరో నాగచైతన్య అంటూ గర్వంగా తలెత్తి మాట్లాడుకుంటున్నారు . అక్కినేని ఫ్యాన్స్ కలను నెరవేర్చేసిన నాగచైతన్య ఇప్పుడు విరుపాక్ష డైరెక్టర్ కార్తీక్ వర్మ దండుతో ఓ ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు .


ఈ సినిమాకి సంబంధించి ఏ అప్డేట్ రిలీజ్ అయినా సరే సోషల్ మీడియాలో ఫాన్స్ హంగామా మామూలుగా ఉండదు. ఈ సినిమా వేరే లెవెల్ లో ఉండబోతుంది అంటూ రిలీజ్ అయిన పోస్టర్స్ ఆధారంగా తెలుస్తుంది. కాగా పోస్టర్సే కాదు సినిమా కాన్సెప్టే కాదు టైటిల్ కూడా చాలా చాలా వెరైటీగా పెడుతున్నాడు డైరెక్టర్ . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం. ఈ సినిమాకి అనుకున్న టైటిల్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. "వృషకర్మ" అనే టైటిల్ ని మేకర్స్ ఈ సినిమా కోసం ఫిక్స్ చేశారట . మరో రెండు టైటిల్స్ అనుకున్న నాగార్జున - నాగచైతన్య మాత్రం "వృషకర్మ" అనే టైటిల్ ఈ కాన్సెప్ట్ కి బాగా సూట్ అవుతుంది అని సెట్ అవుతుంది అని ..ఇదే ఫైనలైజ్ చేయాలి అంటూ కోరారట .



అంతేకాదు ఈ "వృష కర్మ" అనే టైటిల్ ని రిజిస్ట్రేషన్ చేయించే పనిలో బిజీగా ఉన్నారట చిత్ర బృందం . ఈ సినిమాలో హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటిస్తుంది.  నిజానికి పూజ హెగ్డే అనుకున్నారు కానీ పూజ హెగ్డే పరిస్థితి ఏం బాగోలేదు.  బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఇప్పుడిప్పుడే హిట్స్ అందుకుంటున్న నాగచైతన్య మళ్లీ ఎందుకు ఐరన్ లెగ్ బ్యూటీని పెట్టుకొని ఫ్లాప్స్ అందుకోవాలి అంటూ నాగార్జున సినిమాలో హిట్ బ్యూటీ మీనాక్షిని పెట్టుకోమంటూ సజెస్ట్ చేశారట . అంతేకాదు ఈ సినిమాలో మరో బ్యూటీ కూడా ఉంది అని అది మొత్తం సస్పెన్స్ గా తెరపైన చూడాలి అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది.  మొత్తానికి టైటిల్ తోనే సగం హిట్ కొట్టేసాడు నాగచైతన్య అని చెప్పడంలో సందేహమే లేదు . ఈ సినిమాతో మరొకసారి 100 కోట్ల హిట్ ఖాతాలో వేసుకుంటాడు నాగచైతన్య అంటూ అందరూ వెయిట్ చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: