ప్రతి ఒక్క తల్లికి తన బిడ్డలు మంచి పొజిషన్లో ఉండాలి అని ..మంచి స్థానాన్ని అందుకోవాలి అని ..నలుగురు తమ పిల్లల్ని పొగడాలి అని అనుకుంటూ ఉంటారు . జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలిని కూడా అంతే . జూనియర్ ఎన్టీఆర్ లైఫ్ లో బాగా సెటిల్ అవ్వాలి అని .. జూనియర్ ఎన్టీఆర్ నలుగురికి ఆదర్శప్రాయంగా నిలవాలి అని అనుకుంది . నిజానికి ఆ పోజిషన్ కే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం అరాకొరా జూనియర్ ఎన్టీఆర్ పై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తూనే ఉంటాయి . అది ఆయన వ్యక్తిగత జీవితం గురించి కాకపోయినా పొలిటికల్ పరంగా మాత్రం ఆయన గురించి నెగటివ్ కామెంట్స్ ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి .


అయితే జూనియర్ ఎన్టీఆర్ చదువుకునే రోజుల్లో చాలా నాటిగా ఉండేవాడట . అంతేకాదు కోపంలో నోటి నుంచి బూతు పదాలు కూడా ఎక్కువగా మాట్లాడే వారట . అయితే జూనియర్ ఎన్టీఆర్ కి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇలాగే జూనియర్ ఎన్టీఆర్ కోపంలో ఆవేశంలో బూతు పదాలు ఎక్కువగా వాడుతున్న మూమెంట్లో జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలిని - తారక్ దగ్గర ప్రామిస్ చేయించుకుందట.  నువ్వు ఎటువంటి పరిస్ధితుల్లోనూ.. కోపంలో ఏ ఆవేశంలో బూతు పదాలు అనేది వాడకూడదు అంటూ ప్రామిస్ చేయించుకుందట .



మొదటి నుంచి తల్లి ఏది చెప్తే అది వినే తారక్ .. తల్లి కోసం బూతు పదాలను వాడడమే మానేశారట.  జూనియర్ ఎన్టీఆర్ యంగ్ ఏజ్  లో ఉన్నప్పుడు విపరీతంగా పచ్చి బూతు పదాలను వాడే వారట . కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అసలు బూతు పదాలే వాడడం లేదు . తల్లికి ఇచ్చిన మాట కోసం తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని కొన్ని కొన్ని సార్లు తన గురించి తప్పుగా మాట్లాడిన వెధవలను కూడా క్షమిస్తూ వదిలేస్తున్నాడు ఎన్టీఆర్ . ప్రెసెంట్ ఎన్టీఆర్ పలు పాన్ ఇండియా  సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు.  త్వరలోనే వార్ 2 సినిమా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాల్లో ఎన్టీఆర్ రోల్ వేరే లెవెల్ లో ఉండబోతుంది అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.  ఈ సినిమా కోసం ఏకంగా 100 కోట్లు రెమ్యూనరేషన్ కూడా అందుకున్నాడట. కాగా రేపు జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు.. ఇప్పటినుంచే ఫ్యాన్స్ హంగామా మొదలైపోయింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: