
90 లలో బాలీవుడ్ సినీ పరిశ్రమను తన నటనతో ఒక ఊపు ఊపిన ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ అలియాస్ నమ్రత శిరోద్కర్ అక్క సోషల్ మీడియా వేదికగా తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని తెలిపింది. అంతేకాకుండా తనను కలిసిన వారందరికీ కూడా కరోనా టెస్ట్ చేయించుకోవాలంటే పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలంటే సూచిస్తోంది. ఇక బయటికి వచ్చే వారందరూ కూడా కచ్చితంగా మాస్కుని ధరించాలంటూ సోషల్ మీడియా వేదికగా అయితే ఈ విషయం తెలిసిన మహేష్ అభిమానులు మాత్రం శిల్పా శిరోద్కర్ త్వరగా కోలుకోవాలంటే కామెంట్స్ చేస్తున్నారు.
ఇప్పటికే హాంగ్కాంగ్, చైనా, సింగపూర్, థాయిలాండ్ వంటి దేశాలలో కోవిడ్ కేసుల పెరుగుదలను నివేదించడంతో ఇప్పుడు భారతదేశంలో కూడా కేసుల నమోదవడం ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. గడిచిన నాలుగేళ్ల క్రితం కరోనా మహమ్మారి అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. దీనివల్ల యావత్ ప్రపంచం కూడా ఎంతో నష్టాన్ని చవిచేసింది. అయితే ఇదివరకు దూర ప్రాంతాలకు ఈ కరోనా వైరస్ పేరు ఎక్కువగా వినిపిస్తున్నప్పటికీ కానీ ఇప్పుడు ఇండియాకు కూడా పాకడంతో ప్రజలు మరింత భయభ్రాంతులకు గురవుతున్నారు. కరోనా తర్వాత ఎన్నో రకాల వేరియంట్ కలిగిన వైరస్లు వస్తూ ఉన్నాయి.